మిర్యాలగూడ : పనులు పక్కకు పెట్టి కార్యాలయంలోనే ఆ అధికారి కునుకు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యూసుఫ్ అలీ టేబుల్ పై కాళ్లు పెట్టి మరి గాఢ నిద్రలో ఉన్నాడు. తనకోసం ఎవరు వచ్చినా సార్ బిజీగా ఉన్నాడు..

మిర్యాలగూడ : పనులు పక్కకు పెట్టి కార్యాలయంలోనే ఆ అధికారి కునుకు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

మన సాక్షి , మిర్యాలగూడ :

నిత్యం ప్రజల కోసం పనిచేయాల్సిన మున్సిపల్ అధికారికి ఎంతటి నిర్లక్ష్యం అంటే చెప్పనలవి కాదు. కిందిస్తాయి సిబ్బంది ఉద్యోగులు పనిచేయకుంటే వారిపై ఉసరసలాడుతుంటారు. అలాంటివారు పట్టపగలు.. కార్యాలయంలో విధులు నిర్వహిస్తూనే.. తన కుర్చీలో కూర్చుని టేబుల్ పై కాళ్లు చాపి దర్జాగా నిద్రపోతున్నాడు.

మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యూసుఫ్ అలీ టేబుల్ పై కాళ్లు పెట్టి మరి గాఢ నిద్రలో ఉన్నాడు. తనకోసం ఎవరు వచ్చినా సార్ బిజీగా ఉన్నాడు.. తర్వాత రమ్మని బయట వాళ్లకు చెప్పి ఇలా వ్యవహరించినట్లు తెలిసింది. కాగా ఆయన నిద్రపోతున్న ఫోటో వైరల్ గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

శుక్రవారం పలువురు సామాజిక కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంలో నిద్రపోతున్నట్టు నిరసన తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, సిఎండి అధికారులు పరిశీలించి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిద్ర మత్తులో మున్సిపల్ కమిషనర్.. మేలుకొలుపుతున్న సామాజికవేత్తలు..!

గ్రేడ్ వన్ మిర్యాలగూడ మున్సిపాలిటీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండే మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదుదారులపై చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ, ఈ ఆఫీసు నా సొంతం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజలను తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షులు సరికొండ రిషికేశ్వర రాజు , చిలుముల కొండలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు, మున్సిపల్ కమిషనర్ తన ముందు ఉన్నటువంటి ఆఫీస్ టేబుల్ పై తన రెండు కాళ్ళను చాపి తన విధులను మరచి నిద్రపోతున్న ఫోటో ఈరోజు వివిధ వార్తాపత్రికలలో రావడం ఎంతో దురదృష్టకరమని తెలియజేశారు,

ఈ కమిషనర్ పై ప్రజలలో ఇప్పటికే అసహనం అసంతృప్తి పెరిగిందని తెలియజేశారు, కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్నటువంటి ఫిర్యాదుదారులని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య పూరితమైన వ్యవహారాశాలిని తప్పుపట్టారు, జిల్లా కలెక్టర్ మరియు సిడిఎంఏ కమిషనర్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి వెంటనే ఈ కమిషనర్ ని విధులనుంది తొలగించాలని డిమాండ్ చేశారు,

ఈ కార్యక్రమంలో దేవులపల్లి కార్తీక్ రాజు, స.హ.చ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు మచ్చ మధుకర్, డివిజన్ ఉపాధ్యక్షులు మంద శేఖర్, గణేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.