Narayanpet : జల్సాలకు అలవాటు పడి జైలు పాలయ్యారు..!

జల్సాలకు అలవాటు పడి ఇండ్లకు తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని డిఎస్పి ఎన్ లింగయ్య తెలిపారు

Narayanpet : జల్సాలకు అలవాటు పడి జైలు పాలయ్యారు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

జల్సాలకు అలవాటు పడి ఇండ్లకు తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని డిఎస్పి ఎన్ లింగయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయంలో  పత్రిక సమావేశం ఏర్పాటు చేసి నారాయణపేట జిల్లా మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్కురు గ్రామంలో రెండు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన వారి వివరాలను డిఎస్పి తెలిపారు.

ఈనెల 20 తేదీన అర్దరాత్రి వర్కుర్ గ్రామం లో తాళం వున్న ఇంటికి తాళాలు పగులగొట్టి బంగారు నగలు వెండి వస్తువులను దొంగతనం చేయగా వర్కుర్ గ్రామానికి చెందిన ఇంటి యజమాని బొజ్జ మొల్ల సుజాత ఈనెల 21 మాగ్ నూర్ పోలీసుల లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మాగా నూర్ పోలీసులు నమ్మదగిన సంచారం మేరకు నల్లగట్టు మారెమ్మ గుడి దగ్గర ఇద్దరు అనుమనితులైన వ్యక్తులను పట్టుకొని విచారించగా వారిలో ఒక వ్యక్తి వర్కూర్ గ్రామానికి చెందిన ఊరుముందర నరేశ్, అతని స్నేహితుడు కర్నూల్ జిల్లా దేవనకొనడ మండలం పి. కోట కొండ గ్రామానికి చెందిన బోయ వీరేంద్ర ఇద్దరు గత 3 నెలలు గా పరిచయం ఏర్పడింది.

ఇద్దరు కలిసి జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఊదేశ్యంతో, ఇద్దరు కలిసి ఈనెల 19న వర్కూర్ గ్రామానికి వచ్చి అక్కడే రెండు రోజులు ఉండి రెక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇండ్లను అదునుగా చూసి వర్కూర్ గ్రామంలోని నరేష్ ఇంటి వెనకాల వున్న రెండు ఇండ్లకు తాళం వేసి ఉన్నాయనీ చూసి ఈనెల 20న అర్దరాత్రి ఇద్దరు కలిసి తాళాలు విరగగొట్టి దొంగతనం చేసినారు.

వారి ఇంటిలో  6 తులల బంగారం వాటి విలువ 3,00,000/- లక్షల రూపాయలు మరియు 1.5 తులల వెండి మరియు 200 చిల్లర పైసలు, ఒక మొబైలు ఫోన్ దొంగతనం చేసినారు. మగనూర్ పోలీసులు పట్టుకొని వారిని విచారించి వారి నుండి 5.5 తులల బంగారూ ఆభరణాలు (నేకలెస్స్, లాంగ్ చైన్,కమ్మలు, చిన్న ఉంగరం , 1.5 తులాల వెండి వస్తువులు మరియు ఒక సాంసంగ్ మొబైలు ఫోన్, రూపాయలు 8560/- నగదు వారి నుండి స్వాదినాము చేసుకొని వారిని అరెస్ట్ చేసి నారాయణపేట కోర్టు ముందు హాజరు పరిచి కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్ కు తరలించడం జరిగిందని డి.ఎస్.పి. ఎన్ లింగయ్య తెలిపారు.

ఈ కేసును రెండు రోజుల్లో ఛేదించిన మక్తల్ సీఐ చంద్రశేఖర్, మాగనూరు ఎస్సై అబ్దుల్ ఖాదర్, హెడ్ కానిస్టేబుల్ గోపికృష్ణ, కానిస్టేబుల్స్ రవీందర్ సాయికుమార్, రాజశేఖర్ లను డీఎస్పీ అభినందించారు. వారికి త్యరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!