కంకర పరిచారు.. తారు మరిచారు..!
ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 12వ వార్డు శాంతినగర్ కాలనీలో మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులను సగం పూర్తి చేసి వదిలేస్తున్న ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి.

కంకర పరిచారు.. తారు మరిచారు..!
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా రోడ్డు పనులు
ఆమనగల్లు, మనసాక్షి:
ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 12వ వార్డు శాంతినగర్ కాలనీలో మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులను సగం పూర్తి చేసి వదిలేస్తున్న ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. ఆమనగల్లు మున్సిపాలిటీలోని శాంతినగర్ కాలనీలో దాదాపు 30, 40 రోజులు అవుతున్న కంకర పరిచి సిమెంట్ లేదా తారు వేయడం మరిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ సిమెంట్ కలిపిన కంకర పరిచి వదిలేశాడు.ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 12వార్డ్ శాంతి నగర్ లోని వెళ్లే వాహనదారులకు బాటసారులకు సిమెంట్ దుమ్ము కంకర రాళ్లు ఉండడంతో వాహనాలు స్కిడ్ అవుతూ ప్రమాదాలకు గురువుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సిమెంట్ పౌడర్ కంకర వేసిన రోడ్డుపై ఎప్పటి కప్పుడు నీళ్లు చల్లుతూ దుమ్ము లేకుండా జాగ్రత్తలు తీసుకొని రోడ్డు నిర్మించాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడకక్కడ వదిలేశారు.
ఈ పరిస్థితిని చక్కబెట్టాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.రోడ్డుపై అక్కడక్కడ నిర్మిస్తున్న కల్వర్టులను సగం వరకు ఏర్పాటు చేసి వదిలేశారు.రోడ్డుకు రెండు వైపులా ఉన్న నీటి సరఫరా పైపు లైన్లు రోడ్డుపై అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకొని ఈ రోడ్డు పనులను త్వరిత గతిన పూర్తి చేసి ఈ ప్రాంత వాహన దారుల ఇబ్బందులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ వార్తలు చదవండి :
- Almatti Dam : కృష్ణానదిలోకి తగ్గిన వరద.. ఆలమట్టి డ్యామ్ లోకి నామమాత్రపు ప్రవాహం..!
- Hyderabad : ప్రేమ, వేధింపులు.. ఆపై దమ్ముంటే రా.. అని బెదిరింపు.. చివరికి మాదాపూర్ లో దారుణ హత్య..!
- Suryapet : సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పై అధ్యయనం చేసిన సి ఆర్ బి బృందం..!
- El Nino : ఎల్ నినో అంటే ఏమిటి.. తెలంగాణ రైతులు ఏ పంటలు సాగు చేస్తే లాభం.. పూర్తి వివరాలు..!









