Traffic : ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..!

ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రయాణికులకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ అన్నారు.

Traffic : ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..!

* ట్రాఫిక్ ఎస్ఐ మోహన్

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రయాణికులకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని వీధి వ్యాపారులు, చెప్పుల షాపు,పూల కొట్టు నిర్వాహకులను ట్రాఫిక్ స్టేషన్ కి పిలిపించి వారు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు జరుగుతున్న కారణంగా ప్రయాణికులకు, వాహన దారులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రోడ్ వెడల్పు పూర్తి అయ్యేంతవరకు తోపుడుబండ్లను రోడ్లమీదకి తీసుకురావద్దు అని, పూల కొట్టు యజమానులు, చెప్పుల షాపు వారు రోడ్ల మీదికి డబ్బాలను పెట్టవద్దన్నారు.

ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లయితే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సై వెంట నాగరాజు, క్రాంతి కుమార్, కిరణ్, అక్రమ్, మనోహర్ రెడ్డి, లింగా రెడ్డి, క్రాంతి వున్నారు.

MOST READ : 

  1. Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!
  2. మిర్యాలగూడ : యూట్యూబ్ లో చూసి దొంగతనాలు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..!
  3. KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!
  4. Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!
  5. తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!