Telangana : గ్రామాల్లో, మున్సిపాలిటీ వార్డులలో వాలంటరీ వ్యవస్థ..!

బిఆర్ఎస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టేనని ఆ ఓటు మురిగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెన్నార్ గార్డెన్లో జరిగిన నల్లగొండ నియోజక వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాజీ మంత్రి మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి మాట్లాడారు .

Telangana : గ్రామాల్లో, మున్సిపాలిటీ వార్డులలో వాలంటరీ వ్యవస్థ..!

బిఆర్ఎస్ కు ఓటేస్తే మూసీల వేసినట్టే

ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ

ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ , మన సాక్షి:

బిఆర్ఎస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టేనని ఆ ఓటు మురిగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెన్నార్ గార్డెన్లో జరిగిన నల్లగొండ నియోజక వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాజీ మంత్రి మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి మాట్లాడారు .

బి ఆర్ ఎస్ మోసాన్ని గ్రహించి గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం లో 700 కోట్లతో నల్గొండ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని గ్రామాల్లో మున్సిపాలిటీలో వార్డులలో వాలంటరీ వ్యవస్థ వస్తుందని తెలిపారు. నీటి కరువుకు కారణం టిఆర్ఎస్ పార్టీ అన్నారు. మూడేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి అనారోగ్య కారణాలతో మీటింగ్ కు రాలేకపోయారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 200 ఎకరాల లో 10 వేల ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం తన ప్రాణం ఇస్తానని తెలిపారు. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో సొంత నిధులతో 35 ఏసీలు పెట్టించినట్లు చెప్పారు. సీఎం వద్ద పని కావాలంటే తాను చేసుకొస్తానని భారీ మెజార్టీ మీరు ఇవ్వాలని కోరారు .

పేద పిల్లల చదువు బాధ్యత ప్రతి క్ ఫౌండేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ కేటీఆర్ మానసిక పరిస్థితి బాగాలేదని ఆరోపించారు. భారత్ జోడోయాత్ర ద్వారా దేశానికి కనువిప్పు కలిగించిన నేత రాహుల్ గాంధీ అని దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని రాహుల్ ప్రధాని అవుతున్నారని తెలిపారు. 10 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ ను ఓడించిందిరని అన్నారు.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

ఆగస్టు 15 లో రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్ధమే అన్నారు. ఆగిపెట్టి రావు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ఆయన నమ్మవద్దు అన్నారు. 26 వేల కోట్లు కాలేశ్వరంలో ఆబసుపాలైందని తెలిపారు. పార్టీలో నాయకులందరికీ సముచిత గౌరవం ఉంటుందని రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నారు. నిజాయితీకి మారుపేరు కుందూరు జానారెడ్డి అని తెలిపారు .

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా మూడు నెలల్లో పనులు మొదలు పెట్టుకుంటున్నామన్నారు. కంట్రోల్ రూమ్ వ్యవస్థతో ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు. పోలీసులకు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

ALSO READ :

Spr : ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

Bjp : తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ

Telangana : కాంగ్రెస్ పార్టీ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి, తమ్ముడు జితేందర్ రెడ్డి..!