KTR : ఢిల్లీ లో కుస్తీ.. గల్లీ దోస్తీ.. రెండు జాతీయ పార్టీల పరిస్థితి..!

సిరిసిల్లలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్

KTR : ఢిల్లీ లో కుస్తీ.. గల్లీ దోస్తీ.. రెండు జాతీయ పార్టీల పరిస్థితి..!

సిరిసిల్లలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్

Mana Sakshi: 

కేటీఆర్ కామెంట్స్

🔹కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్ తో మేము పోటీ పడ్డాం. మొత్తం 17 స్థానాల్లో మేమే ధీటుగా పోటీ ఇచ్చాం.

🔹ఒక్క సీటు కూడా రాదు అనే పరిస్థితి నుంచి ఇవ్వాళ కాంగ్రెస్, బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది మా గులాబీ దండు.

🔹కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మూడు పార్టీల్లో బీఆర్ఎస్సే ఎక్కువ సీట్లు గెలవబోతోంది.

 

🔹దేశంలో ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ రాదు.

🔹ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి.

🔹ఢిల్లీ లో కుస్తీ…గల్లీ దోస్తీ. ఇది రెండు జాతీయ పార్టీల పరిస్థితి.

🔹కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి లాంటి ఆరేడు ప్రాంతాల్లో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది.

🔹బీజేపీని గెలిపిచేందుకు కిషన్ రెడ్డి కన్నా కూడా రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డాడు.

🔹కేసీఆర్  బస్సుయాత్ర మొత్తం లోక్ సభ ఎన్నికల చిత్రాన్ని మార్చేసింది.

🔹దీంతో కాంగ్రెస్, బీజేపీ లు దిగిరావాల్సిన పరిస్థితి వచ్చింది.

🔹17 రోజుల బస్సుయాత్ర కాంగ్రెస్, బీజేపీలను గింగిరాలు తిప్పింది.

 

🔹కేసీఆర్ గారు ఎక్కడెక్కడికి వెళ్లారో అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

🔹ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పార్టీ నాయకులందరి గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనబడుతోంది.

🔹రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం.

🔹కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాలను రద్దు చేయాలని…కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయాలని చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను చూపించాయి.

🔹ఆరు గ్యారంటీలు వందరోజుల్లో చేస్తామని చెప్పి మోసం చేసిన కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

🔹బోనస్, కరెంట్, రైతుబంధు విషయంలో చేసిన మోసంతో రైతులు భగ్గున మండుతున్నారు.

🔹గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత ఓట్ల రూపంలో కనబడే అవకాశం కనిపిస్తోంది.

 

🔹రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేసినప్పటికీ నమ్మలేని పరిస్థితి వచ్చింది.

🔹కోటి 67 లక్షల మంది మహిళలకు వందరోజుల్లో రూ. 2500 ఇస్తా అని ఇవ్వకపోవటంతో మహిళలు కోపంగా ఉన్నారు.

🔹మహిళలకు 100 రోజుల్లోనే రూ. 2500, స్కూటీలు, తులం బంగారం ఇవ్వలేదు.

🔹చివరకు మంచినీళ్ల విషయంలో కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి తేవటం మహిళల్లో ఆగ్రహానికి కారణమైంది.

🔹పెద్ద మనుషులు కూడా రూ. 4 వేలు అని ఆశపడితే జనవరి నెల 2 వేలు ఎగగొట్టిండు.

🔹కొత్తగా ఏ వర్గం కూడా కాంగ్రెస్ జత కాలేదు. అన్ని వర్గాలు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్నాయి.

 

🔹బీజేపీ మీద కూడా ప్రజల్లో సానుకూలత లేదు. నలుగురు ఎంపీలు ఉండి కూడా పదేళ్లు రాష్ట్రానికి ఏం చేయలేదన్న కోపం ప్రజల్లో ఉంది.

🔹పెట్రోల్, డిజీల్, నిత్యావసరాలు, సిలిండర్ ధరల పెంపు కారణంగా ప్రజల్లో మోడీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది.

🔹మేము అన్ని వర్గాలకు సామాజిక న్యాయాన్ని పాటించాం. 12 జనరల్ స్థానాల్లో 50 శాతం బీసీలకే ఇచ్చాం.

🔹ప్రజలతో మంచి సంబంధాలు…పోరాటే తత్వం ఉన్న వాళ్లకు మేము సీట్లు ఇచ్చాం.

🔹బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం పారాచ్యూట్ లీడర్లకు సీట్లు ఇచ్చారు. దీంతో వాళ్ల పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది.

🔹మా అభ్యర్థుల పట్ల సానుకూలత…వాళ్ల అభ్యర్థులను పట్ల తీవ్ర వ్యతిరేకత

 

🔹గత ఐదు నెలల పాటు కాంగ్రెస్ టైమ్ పాస్ చేసింది. కాళేశ్వరం, శ్వేతపత్రం, ఫోన్ ట్యాపింగ్ పేరుతో సమయం వృథా చేశారు.

🔹ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పై అసాధారణ వ్యతిరేకత వచ్చింది. వారిపై ప్రజల్లో కోపం ఉంది.

🔹ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోతే వారికి దారుణమైన పరాభవం తప్పదు.

🔹బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలు భావించారు.

🔹కాంగ్రెస్, బీజేపీలు సన్నాయి నొక్కులు నొక్కుతూ, కేసీఆర్ ను తిట్టేందుకే ఉన్నాయని ప్రజలు గ్రహించారు.

🔹పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు.

 

🔹ఊహించని విధంగా ఐదు నెలల క్రితం ఓటమి పాలైనప్పటికీ తిరిగి ఎంతో కష్టపడి పనిచేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

🔹కొంతమంది స్వార్థపరులు పార్టీని వీడినప్పుటికీ ఎంతో కష్టపడ్డ పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు

🔹ప్రత్యర్థులు చేసిన దుష్రచారాన్ని తిప్పికొడుతూ సోషల్ మీడియా లోనూ అద్భుతంగా పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కు ధన్యవాదాలు

🔹రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెడతానని బెదిరించినప్పటికీ భయపడకుండా పార్టీ విధానాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు.

🔹లోక్ సభ ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చిన ఆదరణతో పార్టీ పదికాలాల పాటు ఉంటుందన్న ఉత్సాహం జోష్ వచ్చింది.

🔹పార్టీ కార్యకర్తలు చేసిన కష్టం ద్వారా మంచి ఫలితాలు రానున్నాయి. ఈ శ్రమ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలకు బలమైన పునాది కానుంది.

🔹ఎన్నికల్లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు

ALSO READ :

ఏళ్ల తరబడి తండ్రి మృతదేహం ఇంట్లోనే.. ఎందుకు దాచిందో తెలిస్తే షాక్..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?