ఎర్రవరం : బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న సినీ దంపతులు

ఎర్రవరం : బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న సినీ దంపతులు

కోదాడ రూరల్ , మనసాక్షి :

సినీ హీరో శ్రీకాంత్ తన సతీమణి ఊహ దంపతులు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని బాల ఉగ్ర నరసింహ స్వామిని గురువారం దర్శించుకున్నారు. గత కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాలలో ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకునేందుకు అనేకమంది వీఐపీలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తరలివస్తున్నారు.

 

ఈ క్రమంలోనే సినీ హీరో శ్రీకాంత్, తన సతీమణి ఊహ,కుమారుడు రోషన్, లతో కుటుంబ సమేతంగా ఎర్రవరాని విచ్చేశారు. గురువారం సినీ హీరో శ్రీకాంత్ కనిపించడంతో దేవాలయ ప్రాంగణం మొత్తం జన సందోహంగా మారింది. దేవాలయ కమిటీ చైర్మన్ జగన్నాథం దగ్గరుండి వారికి ఉగ్ర నరసింహ స్వామి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

సినీ హీరో శ్రీకాంత్ కావడంతో ఆలయ ప్రాంగణానికి వచ్చిన భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందుతున్న బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తానని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు.

 

MOST READ : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. Telangana : ఆ రైతులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త..!
  3. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
  4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!