Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయం

Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 2018 సాధారణ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలలో లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటివరకు నెరవేరలేదు. ఇచ్చిన హామీని నిలుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం.. పంట రుణాల మాఫీ చేయకపోవడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ఆ పార్టీ చేపట్టిన సర్వేలలో తెలిసింది. నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల పంట రుణాలు మాఫీ చేయలేదు. మొదటి సంవత్సరంలో 25వేల రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేశారు. ఆ తర్వాత 50 వేల రూపాయల లోపు పంట రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు.

 

కానీ కేవలం 37 వేల రూపాయల లోపు రుణాలు ఉన్న వారివి మాత్రమే మాఫీ చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా రూపాయల లోపు రుణాలను మాఫీ చేయకపోవడం వల్ల రైతులలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ఇంటలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. కాగా రైతుల పంట రుణాలను లక్ష రూపాయల లోపు ఉన్న రైతులందరికీ సెప్టెంబర్ నెలాఖరులోగా మాఫీ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

 

ALSO READ : 

 

1. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

2. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

3. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

 

 

రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు 25, 936 కోట్ల రుణాలు ( లక్ష రూపాయల లోపు) ఉన్నట్లుగా నిర్ధారించారు. ఒక కుటుంబంలో ఒకరికే ప్రయోజనం కల్పించాలని ఉద్దేశంతో 3.98 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. 36.68 లక్షల మందికి చెందిన 19, 198 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు లెక్కలు చేసినట్లు సమాచారం.

 

ఇప్పటి వరకు కేవలం 60 వేల మందికి రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేసినట్లు తెలుస్తుంది. పంట రుణాలు తీసుకున్న రైతులలో కేవలం 6 శాతం మంది మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి.

 

మారుతున్న పరిస్థితులు:

 

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తే రైతుల్లో వ్యతిరేకత లేకుండా పోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రైతులకు పంట సహాయంగా రైతుబంధు, దురదృష్టశాత్తు రైతు చనిపోతే రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల పంట రుణాలను కూడా మాఫీ చేసి ఆదుకోవాలని భావిస్తుంది.

 

ALSO READ : 

 

1. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!

2. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

3. Reshan Card : రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ.. గుడ్ న్యూస్..!

 

అందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పంట రుణాలపై త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై మంత్రులు ఎమ్మెల్యేలు సైతం రైతుల రుణాలు మాఫీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది .

 

కాగా ప్రభుత్వ పెద్దలు కూడా రుణమాఫీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రుణమాఫీకి అవసరమైన 20వేల కోట్ల రూపాయల వరకు సొమ్ము సమకూర్చాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు