Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking NewsTOP STORIESజాతీయంటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

వాట్సాప్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. దాంతో వాట్సప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే వాట్సాప్ అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంకా అప్డేట్ లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

 

యూజర్ ఎకౌంటు సెక్యూరిటీ కోసం కొన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ వినియోగదారుల చాట్ పై వేరొకరు.. వారికి తెలియకుండానే చదివే అవకాశాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ ఖాతాను ఇతర పరికరాలతో ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు సమస్యలు కూడా రావచ్చు.

 

వాట్సాప్ ను కంప్యూటర్ లో వాడే వారి సంఖ్య కూడా పెరిగింది. అందుకోసం మన వాట్సప్ కాదా ఎక్కడ లాగిన్ అయ్యిందో కూడా తెలియదు అందుకోసం మీ వాట్సాప్ ను ఎవరైనా చూస్తున్నారో..? లేదో ..? తెలుసుకోవాల్సి ఉంది.

 

కొన్నిసార్లు వినియోగదారుల పొరపాటు వల్ల ఇతరులు తమ వాట్సాప్ చాట్, ఫొటోస్, వీడియోలను చూస్తుంటారు. అంటే యూజర్ల పొరపాటు వల్ల వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో హ్యాక్ అయిన వాట్సాప్ కొన్నిసార్లు దుర్వినియోగం కూడా కావచ్చును.

 

ALSO READ : 

1. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

2. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

3. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

 

అంతే కాకుండా ఎవరైనా యూజర్ వాట్సప్ చాట్ ను మీకు తెలియకుండా రహస్యంగా చదువుతున్నారా..? వీడియోలు చూస్తున్నారా..? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా యూజర్ వాట్సాప్ ని రహస్యంగా చదువుతున్నారని తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు. వినియోగదారులు తమ వాట్సాప్ లోనే ఈ సమాచారాన్ని పొందవచ్చును.

 

మీ వాట్సప్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. కుడి వైపున కనిపించే మూడు చుక్కలను క్లిక్ చేయండి. ఆ తర్వాత అక్కడ కనిపించే వాట్స్అప్ వెబ్ లింక్ డివైస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు మీ ల్యాబ్ టాప్ లేదా డిస్క్ టాప్ లో వాట్సాప్ ని తెరవకపోయినా అది లింకును చూపుతున్నట్లయితే మీ వాట్సాప్ చాట్ ను ఎవరో చదువుతున్నారని అర్థం. అప్పుడు లింక్ డివైజ్ ను రిమూవ్ చేయండి. అప్పుడు మీ చాట్ ను వేరే వారు చూసే అవకాశం లేకుండా పోతుంది.

 

ALSO READ :

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

3. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

 

మరిన్ని వార్తలు