Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!

Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!

మనసాక్షి, వెబ్ డిస్క్:

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. ఎన్నికల నాటి హామీని అమలుపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రుణమాఫీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రైతుల ఖాతాలలోకి నేరుగా రుణమాఫీ డబ్బులను జమ చేయడానికి గాను ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. రుణమాఫీ ఏ విధంగా ఎవరికి అమలు కానున్నదో .. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలుసుకుందాం.. !

 

రైతు రుణ మాఫీ పై వివరణలు:

(1). రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ?

తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఉన్న రైతులకు మాత్రమే. రుణమాఫీ వర్తిస్తుంది.

(02). రుణమాఫీ ఎంత వరకు వస్తుంది ?

కుటుంబానికి రూ॥ లక్ష వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది.

(3)తేది 11-12-2018 నాటికి బ్యాంకులో రూ॥ 1,60,000/- అప్పు ఉంది. వారికి రుణమాఫీ వస్తుందా?

తేది 11-12-2018 నాటికి లక్ష పైబడి అప్పు ఉన్న రూ॥ లక్ష వరకు రుణమాఫీ వస్తుంది.

(4). తేది 11-12-2018 నాటికి రూ॥ 30,000/- అప్పు ఉండి, ప్రస్తుతం అప్పు రూ 1,00,000/- ఉన్న వారికి రూ॥ లక్ష్మ రుణమాఫీ వస్తుందా?

నిబంధనల ప్రకారం తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత అయి ఉంటుందో అంతే రుణమాఫీ వస్తుంది. అంటే రూ॥ 70,000/- వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది.

 

(5) తేది 11-12-2018 వరకు రూ॥ 1,00,000/- అప్పు ఉండి తేని 31-07-2023 నాడు రూ|| 50000/- వరకు అప్పును పునరుద్ధరన చేసుకున్న వారికి రుణమని వస్తుందా? ఎంత వరకు వస్తుంది.?

రెన్యువల్ కి రుణమాఫీ కి ఎలాంటి సంబంధం లేదు. తేది 11-12-2018 తరువాత అప్పుని రెన్యువల్ చేసుకున్నా, మరియు అప్పు మొత్తం కట్టి. క్లోన్ చేసుకున్న రుణమాఫీ కి అర్యులే. తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత ఉంటుందో (May. రూ. లక్ష వరకు) రుణమాఫీ కూడా అంతే వస్తుంది. కాబట్టి రూ.లక్ష వరకు రుణమాఫీ వస్తుంది.

6) తేది 11-12-2018 నాటికి భార్యకు రూ॥ 50,000/- అప్పు ఉండి మరియు భర్తకు రూ॥ 70,000/- అప్పు ఉన్నచో రుణమాఫీ ఎంత వరకు వస్తుంది !
కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుంది కాబట్టి భార్యకు రూ॥ 50,000/- మరియు భర్తకు రూ॥ 50,000/- రుణమాఫీ వస్తుంది.

 

ALSO READ : 

  1. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
  2. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
  3. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

 

(7) తేది 11-12-2018 నాటికి భార్యకు రూ 1,10,000/- భర్తకు 1,60,000/- ఉన్నా రుణమాఫీ ఎంత వస్తుంది ?

భార్య లేదా భర్త, ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే రూ॥ లక్ష వరకు రుణమాఫి వస్తుంది.

(8) తేది 11-12-2018. తరువాత తీసుకున్న కొత్త రుణాలకు మాఫీ వస్తుందా?
తేది 11-12-2018 తరువాత తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు.

 

ALSO READ : 

  1. Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!
  2. WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!
  3. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?

మరిన్ని వార్తలు