Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్

TELANGANA : బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్

ఏడుగురు సిట్టింగ్ ల మార్పు

హైదరాబాద్ , మనసాక్షి :

అసెంబ్లీ ఎన్నికల టికెట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ తొలి జాబితాలో 115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. కేవలం నాలుగు చోట్ల మాత్రమే పెండింగ్ ఉంచారు. ఏడుగురు అభ్యర్థులను మార్పు చేసి మిగతా సిట్టింగ్ అందరికీ యధావిధిగా టికెట్లు కేటాయించారు.

 

సెట్టింగ్ ల లో ఏడుగురి అభ్యర్థులను మాత్రమే మార్పులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో అభ్యర్థుల, ఆశావాహుల ఉత్కంఠత వీడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

 

MOST READ : 

  1. తెలంగాణ భవన్ కు ముఖ్యమంత్రి కెసిఆర్
  2. మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్
  3. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి

 

హుజురాబాద్ నుంచి కౌశిక్ రెడ్డికి టికెట్ దొరికింది, వేములవాడ – లక్ష్మీనరసింహారావు, ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి , ఖానాపూర్ నుంచి భూక్య జాన్సన్ నాయక్, భోద్ – అనిల్ యాదవ్, వైరా – మదన్ లాల్, స్టేషన్ ఘన్పూర్ – కడియం శ్రీహరి, కంటోన్మెంట్ – లాస్య నందిత, కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్ కి టికెట్లు ఖరారు చేశారు.

 

మిగతా సిట్టింగ్ లందరికీ టికెట్లు యధావిధిగా ఖరారు చేశారు . అంతేకాకుండా నాంపల్లి, గోషామహల్, జనగామ, నరసాపూర్ స్థానాలను పెండింగ్ లో ఉంచారు.

 

మరిన్ని వార్తలు