ఓట్లు మావే సీట్లు మాకే అంటూ.. భారీ బైక్ ర్యాలీతో గళమెత్తిన బీసీ నాయకులు..!
ఓట్లు మావే సీట్లు మాకే అంటూ.. భారీ బైక్ ర్యాలీతో గళమెత్తిన బీసీ నాయకులు..!
ఐదువందల బైక్ లతో ర్యాలీ
మంచిర్యాల నియోజకవర్గ సీటు బీసీలకే కేటాయించాలి.
లక్షేట్టిపేట్, (మన సాక్షి) :
లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ పరిధికి వచ్చిన బిసి నాయకుల భారీ బైక్ ర్యాలీ, బీసీ బహుజనులు ఐక్యం అయి రాజ్యాదికారమే ధ్యేయంగా ముందుకు సాగాలని నినదిస్తూ మంచిర్యాల నుండి ఐదువందల బైక్ లతో మొదలైన బైక్ ర్యాలీ లక్షేట్టిపేట్ కు చేరుకుని లక్షేట్టిపేట్ పట్టణంలో కొనసాగింది. బైక్ ర్యాలీ అనంతరం తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన బిసి నాయకులు.
ALSO READ :
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Congress : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు : టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్లు మావే సీట్లు మాకే అంటూ వ్యాఖ్యానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో మంచిర్యాల నియోజకవర్గంలో బిసి అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ ప్రధాన పార్టీ ప్రకటించినా వారికి బిసిలందరం తోడ్పాటు అందించి భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బిసిలం పోటీలో ఉండీ బిసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలుపిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ నేతలు డా. చుంచు రాజ్ కిరణ్, గాజుల ముఖేష్ గౌడ్,జడ్పీటీసీ ముత్తె సత్తయ్య,డా.రమణ,డా.నీల కంటేశ్వర్, డా. రఘునందన్,నీలి శ్రీనివాస్, చుంచు గిరిధర్,చింతకింది సుధాకర్ వివిధ బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.









