Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంక్షేమంసిద్దిపేట జిల్లా

ID CARDS : మత్స్యకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ..!

ID CARDS : మత్స్యకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ..!

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మూడు లక్షల చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే

హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

సిద్దిపేట్ , మనసాక్షి :

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మూడు లక్షల చేప పిల్లలను గురువారం రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ వదిలారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో 49,87, 876 చేప పిల్లలను చెరువులలో వదిలామని దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సీఎం కేసీఆర్  అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈరోజు సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారుల వలె తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారన్నారు.

ALSO READ : Train Derails Video : ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. ఇంజన్ క్యాబిన్ లో సీసీ కెమెరా దృశ్యాలు..!

మత్స్యకారులకు రాష్ట్రంలోని చెరువులకు ప్రభుత్వం హక్కు కల్పించి చేప పిల్లలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తద్వారా పెరిగిన చేపలను మత్స్యకారులు పట్టుకుని వాటిని అమ్ముకొని వారి యొక్క ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని తద్వారా గణనీయమైన తలసరి ఆదాయం పెరిగిందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

పోతారం (ఎస్ )శుభంగార్డెన్ లో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన మత్స్యకారులకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి గుర్తింపు కార్డులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అందించారు.

ALSO READ : Khairathabad Crocodile : ఖైరతాబాద్ నాలాలో మొసలి ప్రత్యక్షం.. భయాందోళనలో ప్రజలు..!

రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ పురుషుల మత్స్యకారుల సొసైటీ ఉన్నట్లుగానే మహిళలకు సొసైటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

మత్స్యకారులకు టూవీలర్లు, ఆటోలు గతంలో అందించినట్లుగా త్వరలో అందిస్తామని మత్స్యకారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు మహిళలు, పురుషులు పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు