Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Attack : వృద్ధ దంపతులపై కన్న కొడుకే విచక్షణ రహితంగా దాడి..!

Attack : వృద్ధ దంపతులపై కన్న కొడుకే విచక్షణ రహితంగా దాడి..!

ఆస్తి కోసం తల్లిదండ్రులపై కన్న కొడుకే ఘాతుకం

బాధితులకు అండగా నిలవాలి – కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ విజయరావు

మదనపల్లి, మన సాక్షి :

మదనపల్లిలో శని వారం సాయంత్రం వృద్ధ దంపతులపై కన్న కొడుకే విచక్షణ రహితంగా దాడి చేసిన దుస్సంఘటన ఆదివారం వెలుగు చూసింది. ఆస్తి పంపకాల విషయంలో తల్లి దండ్రులపై తనయుడు ఘాతుకానికి వడిగట్టాడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన పై వీడియో వైరల్‌ అయింది. కలకలాన్ని సృష్టించింది.

వృద్ధ తల్లిదండ్రుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఘటన పై కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ విజయరావు సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని మదన పల్లె టు టౌన్ పోలీసులకు ఆదేశించారు. మదనపల్లి పట్టణంలోని నీరు గట్టువారిపల్లె, అయోధ్యనగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులురెడ్డికి భూ వివాదం ఉంది.

ఆస్తి పంపకాల నేపథ్యంలో తనకు సరైన న్యాయం చేయలేదని లక్ష్మమ్మ, వెంకటరమణారెడ్డి దంపతులపై వారి చిన్న కొడుకు శ్రీనివాసరెడ్డి దాడికి పాల్పడినట్లు శనివారం బాధితులు ఫిర్యాదిచ్చారని చెప్పారు.
వెంటనే ఆ ఫిర్యాదుపై మదనపల్లె టు టౌన్ పియస్ క్రైమ్ నెంబర్ 77 / 2024 U/S 324, 506 IPC క్రింద కేసు నమోదు చేశామని, బాధిత తల్లిదండ్రులను ప్రభుత్వ ఆస్పత్రికి కూడా తరలించి వారికి భరోసా కల్పించి , మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకున్నాము. దాడికి పాల్పడిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు