Temple of Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడో తెలుసా..!
Temple of Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. ఎక్కడో తెలుసా..!
మన సాక్షి : తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో గుడి నిర్మించబోతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి నిర్మించబోతున్నారంటే అది ఆయన సొంత జిల్లాలో అనుకోవడం సహజం. కానీ ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యాక మరింత అభిమానం పెరిగింది. గుడి నిర్మాణానికి అభిమానులు ముందుకు వచ్చారు.
ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఈ గుడిని నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వానిపాకలలో నిర్మించనున్నారు. ఈ నెల 19వ తేదీన గుడి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ ప్రకటించారు. ఈ దేవాలయం నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.
దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని, కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని… అందువల్లనే గుడి నిర్మించబోతున్నట్లు తెలిపారు. పేద ప్రజల బాగోగులు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దేవుడని, అలాంటి కారణజన్ముడికి గుడి కట్టడం తమ అదృష్టమని ఆయన చెప్పారు. దేవాలయ భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
గతంలో దేవాలయాలు :
గతంలో సినీ తారలనే దేవుడిగా భావించే అభిమానులు ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో రాజకీయ నాయకులను కూడా దేవుడిగా భావించి దేవాలయాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏఐసీసీ సీనియర్ నేత సోనియా గాంధీ , మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, ఎన్టీఆర్ తో పాటు కేసీఆర్ కు సైతం అభిమానులు దేవాలయాలు నిర్మించి పూజలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కి సైతం గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం ప్రకటన చేయడం హాట్ హాట్ గా మారింది.
రేవంత్ రెడ్డికి పెరుగుతున్న క్రేజ్ :
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రోజురోజుకు ఆయనకు క్రేజ్ పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం లో ఆయన ఎంతో కృషిచేసి న విషయం తెలిసిందే. అంతే కాకుండా పరిపాలనలో కూడా రేవంత్ రెడ్డి మార్క్ ఉండేలా పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేసేందుకు రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో క్రేజ్ పెరుగుతుంది.
MOST READ :
- Suicide : 12 రోజుల్లో పెళ్లి.. అంతలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..!
- Missing : తప్పిపోయిన అమ్మాయి.. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..!
- Miryalaguda : అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!
- అమ్మాయి కిడ్నాపు.. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు..!
- Nagar Karnool : పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించిన యువకుడు.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలు..!









