Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లాసంక్షేమం

Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!

Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!

గృహజ్యోతి పథకం తమకు అర్హత ఉన్నా వర్తించలేదంటూ ఎంపీడీవో ఆఫీసు చుట్టూ జిరాక్స్ కాగితాలతో ప్రజలు ప్రదక్షిణలు

దమ్మపేట, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రేషన్ కార్డు , ఆధార్ కార్డుతో పాటు సొంత ఇల్లు కలిగి ఉండి 150 రూపాయల కరెంటు బిల్లు మాత్రమే వస్తుంది. కానీ కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ద్వారా అలాంటి ఇంటికి జీరో కరెంటు బిల్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మార్చి మాసం నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లు ఇచ్చే వారందరికీ జీరో బిల్లు వస్తుందని దీనిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కానీ అవి ఎక్కడో ఒకచోట కొద్ది గొప్ప బిల్లులు వచ్చాయి. ఎక్కువ మందికి కరెంట్ బిల్లులు వచ్చాయి. అదేమిటి అని అడిగితే కరెంట్ ఆఫీసు, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసులో వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలని చెబుతున్నారు.

అక్కడికి వెళితే మీరు చేసిన దరఖాస్తు ఆన్ లైన్ ఎంటర్ కాలేదు. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా లేదు. అంటూ సమాధానాలు వినిపిస్తున్నాయి. దాంతో లబ్ధిదారులు కార్యాలయాలు చుట్టూ తిరగడం… అయోమయ పరిస్థితికి వచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గృహ జ్యోతి లబ్దిదారులు అయోమయ పరిస్థితిలో జీరో బిల్లులు రాక కాగితాలు పట్టుకొని ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వైనం వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల ప్రజలకు పూర్తి అవగాహన లేకుండా అప్లికేషన్ ఫిల్ అప్ చేసిన పద్ధతిలో గృహ జ్యోతి పథకంలో కరెంటు బిల్లు సర్వీస్ నెంబర్లు అప్లికేషన్ లో ఎంటర్ చేసిన వారికి జీరో బిల్లులు రావడం లేదు.

దరఖాస్తు ఏ విధంగా పూర్తి చేయాలో తెలియని పూర్తి అవగాహన లేకుండా సర్వీస్ నెంబరు ఎంటర్ చేసిన వారికి జీరో బిల్లులు రావడం లేదు యూఎస్సీ నెంబర్ దరఖాస్తులు రాసిన వారికి మాత్రమే రావడం జరుగుతుంది. జీరో బిల్లు రానివారు విద్యుత్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే దాని డిలీట్ ఆప్షన్ రాలేదనితెలియజేశారు.

అలాగే దరఖాస్తు తీసుకున్న అధికారులు పూర్తిగా అవగాహన లేకుండా దమ్మపేట మండలంలో తప్పులు ఎంటర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మండలంలో చాలామంది నిరుపేదలు, గిరిజనులు గృహజ్యోతి పథకం తమకు అర్హత ఉన్నా వర్తించలేదంటూ ఎంపీడీవో ఆఫీసు చుట్టూ జిరాక్స్ కాగితాలతో ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు.

దీనిపై ఆరా తీయగా ప్రైవేటు వ్యక్తులచే డేటాఎంట్రీ నిర్వహించడంతో ఆన్లైన్ దరఖాస్తు నింపే క్రమంలో తప్పులు దొర్లినట్టుగా తెలుస్తుంది. దీనితో చాలామంది అర్హత ఉన్న గృహ జ్యోతి పథకానికి అనర్హులుగా మారినట్టు బహిర్గతమైనది.

అయితే ఈ ఒక్క పథకం కోసమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారింటిలకు సంభందించి ఒక్కటే దరఖాస్తు కావడంతో ఎందరు ఏఏ పథకాలకు డేటా ఎంట్రీలో తప్పలతో అనర్హులకు మారారో ఇందిరమ్మ ఇల్లు వస్తాయో రావో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు పూర్తిగా పర్యవేక్షణ చేసి అర్హులైన అందరికీ గృహ జ్యోతి పథకం వర్తింపజేసే విధంగా చేయాలని పలువురు కోరుతున్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు