Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!

Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!
మిర్యాలగూడ , మన సాక్షి :

ఫోన్ టాపింగ్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫోన్ టాపింగ్ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఫోన్ టాపింగ్ ఆరోపణలు ఆ పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అదే క్రమంలో మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు పై మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు.

ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోన్ టాపింగ్ పై భాస్కరరావును ప్రధాన ముద్దాయిగా విచారించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10 సంవత్సరాల కాలంలో సుమారు 150 మంది ఫోన్లు టాపింగ్ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి కొంత మందిని బెదిరించినట్లు కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మిర్యాలగూడ శాసనసభ్యులు అభివృద్ధి చేశారని చెప్పడం సరైనది కాదని, ఆయన ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు.

ఫోన్ టాపింగ్ విషయంలో ఓ రైస్ మిల్లర్ ను బెదిరించారని, ఓ అధికారిని బెదిరించారని, స్కైలాబ్ నాయక్ ఆరోపణలు చేశారు. అదేవిధంగా వైదేహి వెంచర్ కు సంబంధించి ఓ బీసీ నాయకుడిని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నది వాస్తవమా..? కాదా..? అని ప్రశ్నించారు. వైదేహి వెంచర్ లో ప్రభుత్వ భూమి ఉన్న విషయం వాస్తవమా..?కాదా..? అంటూ ఆయన పేర్కొన్నారు. అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

కెసిఆర్ ను స్వచ్ఛందంగా ప్రజలు అడ్డుకుంటారు:

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 24వ తేదీన మిర్యాలగూడకు ఎందుకొస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్ అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం పై 100 అబద్ధాలు చెప్పడానికి వస్తున్నారా..? చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడానికి వస్తున్నారా..? అంటూ ఆయన పేర్కొన్నారు.

మిర్యాలగూడకు రావడానికి కేసీఆర్ కు, జగదీశ్వర్ రెడ్డికి అర్హత లేదన్నారు. మిర్యాలగూడ కు రావాలంటే ముక్కు నేలకు రాసి తప్పు ఒప్పుకొని రావాలని పేర్కొన్నారు. కెసిఆర్ మిర్యాలగూడ వస్తుంటే ఆయనను అడ్డుకోవడానికి ప్రజలే స్వచ్ఛందంగా సిద్ధమయ్యారని స్కైలాబ్ నాయక్ పేర్కొన్నారు.

రఘువీర్ రెడ్డిని గెలిపించాలి.

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్కైలాబ్ నాయక్ కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థి రఘు రెడ్డిని గెలిపించాలని కోరారు. కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు.

మరెన్నో వార్తలు క్లిక్ చేసి చదవండి : 

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!

Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు