Open Exams : వ్యాపార కేంద్రాలుగా ఓపెన్ టెన్త్ , ఇంటర్ పరీక్ష కేంద్రాలు.. పట్టించుకోని ఉన్నతాధికారులు..!
Open Exams : వ్యాపార కేంద్రాలుగా ఓపెన్ టెన్త్ , ఇంటర్ పరీక్ష కేంద్రాలు.. పట్టించుకోని ఉన్నతాధికారులు..!
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలా?ఓపెన్ క్యాష్ పరీక్షా లా ?
సమాధానం చెప్పాలని డిమాండ్
ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలో అవీనీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి.
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి శంకర్
నల్లగొండ/ మిర్యాలగూడ, మన సాక్షి:
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ అన్నారు. శుక్రవారం దోడ్డి కోమరయ్య భవనం లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ..
ఈ పరీక్షల్లో నిజమైన విద్యార్థులకు బదులు వేరేవారు వచ్చి పరీక్షలు రాయడం జరుగుతుంది. ఇలా రాయడానికి సెంటర్ లో సహకరించాలంటే ఒక్కొక్క పరీక్ష కు 1000నుంచి 2000వరకు వసూలు చేస్తున్నారు. జనరల్ గా ప్రతి పరీక్ష కు500నుంచి 1000వసూలు చేస్తూ లక్షల రూపాయలు స్వాహ చేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారికి తెలిసినా .. తెలియనట్టు వ్యవహరించడం దేనికీ సంకేతమనీ అన్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25న ప్రారంభం అయిన ఒపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయినాయి. ఇదే అదునుగా భావించిన కొంత మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా స్థాయి అధికారులు, ఒపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల కన్వీనర్ లు కలిసి ఓపెన్ క్యాష్ పరీక్షా లుగా మార్చినారన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ పట్టణ కేంద్రంలో జరుగుతున్న ఓపెన్ టెన్త్ పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
రెగ్యులర్ గా బడికీ పోలేక ఇబ్బంది పడుతూ కనీసం ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు రాసి అయిన విద్యాబ్యాసం కోనసాగించాలి అనే ఆశతో వస్తున్న బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్న పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఆ విద్యార్థినీ, విద్యార్థుల రక్తాన్ని తాగుతున్న ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల కన్వీనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ ; Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్..!
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు ఒక వ్యాపార కేంద్రాలు గా మారాయని అన్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పరిక్ష కేంద్రంలో తరగతి గదిలో సంచులు పట్టుకోని డబ్బులు వసూలు చేయడం చాలా దుర్మార్గమైన పని అని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారిపై, ఒపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల నిర్వాహణ అధికారి పై సమగ్ర విచారణ జరిపి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
లేనిపక్షంలో భవిష్యత్తులో పదోతరగతి పరీక్షలకు కూడ ఇలా జరిగే ప్రమాదం ఉందని తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ పి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు ను నియమించి ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల లో అవినీతి అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ అధీకారులపై ఉక్కు పాదం మోపాలని , పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందు పోయే విధంగా కృషి చేయాలని అన్నారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు నివ్వడం జరుగుతుందని తెలిపారు.
ALSO READ :
BIG BREAKING : కెసిఆర్ కాన్వాయ్ లో ప్రమాదం..!
Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది..!
BREAKING : బీఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాలు.. మిర్యాలగూడలో మరో సీనియర్ నేత రాజీనామా..!
Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!









