Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంక్రైంతెలంగాణరంగారెడ్డి

ACB RAIDS : రూ.15వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇంజనీరింగ్ ఏఈ..!

ACB RAIDS : రూ.15వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇంజనీరింగ్ ఏఈ..!

రాజేంద్రనగర్ , మనసాక్షి:

రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి కార్యాలయంలో ఇంజనీరింగ్ ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ మజీద్ అలీ ఖాన్ వివరాలను వెల్లడించారు… సంతోష్ నగర్కు చెందిన కాంట్రాక్టర్ మూజాఫరుద్దీన్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని 11వ వార్డు ఆదర్శనగర్ లో 6.5 లక్షలతో చేపట్టారు.

ఈ క్రమంలో సిసి రోడ్డు పనుల నిధులు మంజూరు చేయాలని ఏఈ బలవంత్ రెడ్డిని కొరగా అతను 24వే రూపాయల లంచం డిమాండ్ చేశాడని చివరకు 15వేల రూపాయలకు బేరసారాలు కూదరడంతో కాంట్రాక్టర్ ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏఈ చాంబర్లో 15వేల రూపాయలను ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బలవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని వారి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ : 

Every Friday: ప్రతీ శుక్రవారం డ్రై డే.. మేయర్ లతా ప్రేమ్ గౌడ్..!

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు