Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

మన సాక్షి, నాగార్జునసాగర్ :

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రావడంతో సాగర్ జలాశయం జలకలతో ఉంది. దాంతో శుక్రవారం సాగర్ జలాశయం వద్ద కృష్ణమ్మకు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి జలహారతి పూజలు నిర్వహించారు. అనంతరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

ఇప్పటికే కుడి కాల్వకు 5,944 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద నీరు రావడంతో సాగర్ నీటిమట్టం పెరుగుతుంది. కుడి కాలువ తో పాటు ఎడమ కాలువకు కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నారు. ఎడమ కాలువకు నీటి విడుదల చేయడం వల్ల ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో రైతాంగంకు సాగునీరు అందే అవకాశం ఉంది. కార్యక్రమంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

DEVARAKONDA : ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి..!

Srisailam : శ్రీశైలం అవుట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు.. వేగంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం.. Latest Update

NALGONDA : నల్గొండ జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక కమిటీ.. ఆ కమిటీ ఏం చేస్తుందంటే..! 

మరిన్ని వార్తలు