Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలువిద్యసంగారెడ్డి జిల్లా

పేద రైతు కుటుంబాల్లో మెరిసిన విద్యా కుసుమాలు.. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులు..!

పేద రైతు కుటుంబాల్లో మెరిసిన విద్యా కుసుమాలు.. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులు..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో ఇటీవల ముగ్గురు విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్స్ లో సీట్లు పొందారు. కంగ్టి గ్రామానికి చెందిన సిర్మా అఖిల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ సాధించగా.. తురకవడగామ కు చెందిన గులే ప్రవీణ్ మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు పొందారు. తడ్కల్ ఎడ్ల రేగడి తండా కు చెందిన జీవన్ సింగ్ కు నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.

ముగ్గురు విద్యార్థులు పేద రైతు కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం. మారుమూల ప్రాంతానికి చెందిన రైతు కుటుంబాల నుంచి వైద్యులుగా శిక్షణ పొందడానికి అర్హత సాధించడంతోపాటు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పొందడంతో కుటుంబీకులతోపాటు పరిసర గ్రామాల్లోని ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చెల్లించలేని కుటుంబంలో విద్యా కుసుమాలు ఎదగడంతో వారి పంట పండిందని అంతటా హర్షం వ్యక్తం అవుతుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు