Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsviralజాతీయం

Viral Video : బస్సులోని ప్రయాణికులకు షాక్ ఇచ్చిన చిరుత.. (వైరల్ వీడియో)

Viral Video : బస్సులోని ప్రయాణికులకు షాక్ ఇచ్చిన చిరుత.. (వైరల్ వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మనదేశంలో జంగిల్ సఫారీ టూర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ప్రమాదకర జంతువులతో ఆటలాడుకుంటున్నారు. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గతంలో సింహాలు, పులులు ప్రమాదకర జంతువులను చూసేందుకు జూపార్కులకు వెళ్లేవారు.

కానీ ఇటీవల కాలంలో నేరుగా అటవీ పర్యటనలకే వెళ్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా దక్షిణాఫ్రికాలో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా అలాంటివే జరుగుతున్నాయి. దేశంలో కర్ణాటక రాష్ట్రంలో బన్నెర గట్ట నేషనల్ పార్క్ లో ఈ వీడియో చిత్రీకరించడం జరిగింది.

ఈ వైరల్ అయితున్న వీడియో ప్రకారం.. బన్నెర ఘట్ట నేషనల్ పార్కు కు కొంతమంది సందర్శకులు టూర్ వెళ్లారు. అయితే ప్రయాణికులతో ఉన్న ఈ బస్సు దగ్గరకు ఓ చిరుత పులి వచ్చింది. దాంతో ప్రయాణికులు చిరుతపులిని చూసేందుకు మొదట్లో ఆసక్తి కనబరిచారు.

కానీ ఆ చిరుత పులి పైకి ఎగిరి ఆ బస్సు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. దాంతో బస్సులోని ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో అరుపులు కేకలు వేశారు. అయితే బస్సుకు కిటికీలకు మెస్ ఉండడంతో చిరుత లోపలి ప్రవేశించలేకపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నేటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు