TOP STORIESBreaking Newsతెలంగాణ
Gold Price : గురువారం తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంతంటే..!

Gold Price : గురువారం తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర తెలుగు రాష్ట్రాలలో గురువారం కొంతమేరకు తగ్గింది. దాంతో మహిళలు ఆనందంలో ఉన్నారు. బంగారం ధర పెరుగుతున్నా కొద్దీ కొనుగోలు దారులు కూడా పెరగడం విశేషంగా ఉంది.
గురువారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1100 రూపాయలు తగ్గింది. దాంతో 100 గ్రాముల ధర 13,02,000 రూపాయలుగా ఉంది. అదే విధంగా 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ ధర హైదరాబాదులో గురువారం 110 రూపాయలు తగ్గి 1,30,200 రూపాయలుగా ఉంది.
22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాముల (తులం) బంగారం కు వంద రూపాయలు తగ్గి 1,19,350 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో ఉన్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఉన్నాయి.









