Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIEStravelతెలంగాణ

TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందజేసింది. నూతన సంవత్సరంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది.

గతంలో వాహనం కొనుగోలు చేసిన సమయంలో వాహన షోరూం వద్ద (టీఆర్) టెంపరరీ రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. ఆ తర్వాత ఆర్టిఏ ఆఫీస్ కి వెళ్లి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇకపై శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా షోరూమ్ లోనే చేయనున్నారు. దాంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోతుంది.

డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చును. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 డిసెంబర్ 19వ తేదీన రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. దాంతో రిజిస్ట్రేషన్ రవాణా శాఖ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయడానికి నూతన సాఫ్ట్ వేర్ 15 రోజులలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇకపై వాహన షోరూం (డీలర్) వద్దనే శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధానం దేశంలోని అనేక రాష్ట్రాలలో అమలులో ఉన్నది.

ఇకపై తెలంగాణలో కూడా అమలు కానున్నది. రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాహన్ సారథి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. పూర్తిస్థాయిలో రాష్ట్రంలో అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దీనిని వెంటనే అమలు చేయడానికి ప్రత్యేక సాఫ్టువేర్ రూపొందించాలని ప్రభుత్వం అధికారూలను ఆదేశించింది. ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తికానున్నది.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  2. Nalgonda : తెలంగాణ ట్రాన్స్కో డిస్కం ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్స్ ప్రారంభం..!

  3. Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..! 

  4. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

మరిన్ని వార్తలు