TG News : పునర్విభజనతో తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు.. ఏ జిల్లాలో ఎన్ని.. తెలుసుకుందాం..!
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలకు పెరిగే అవకాశాలున్నాయి.

TG News : పునర్విభజనతో తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు.. ఏ జిల్లాలో ఎన్ని.. తెలుసుకుందాం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలకు పెరిగే అవకాశాలున్నాయి.
దాంతో పాటు మహిళా బిల్లును కూడా పార్లమెంటు ఆమోదం చేస్తే మహిళలకు కూడా అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవకాశం అయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా కొత్త నియోజకవర్గాలు, మహిళా నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
సీట్ల పెంపు తెలంగాణలో ఇలా..!
నియోజకవర్గాల పునర్విభజన కారణంగా తెలంగాణలో సీట్ల పెంపు ఎలా ఉంటుందంటే.. 2011 నాటి జనాభా ప్రకారం 3.5 కోట్ల, మంది జనాభా ఉన్నారు. అసెంబ్లీ సీట్లు మరో 60 పెరగనున్నాయి. ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో 60 పెరిగితే 179 స్థానాలు కానున్నాయి. 5.83 లక్షల జనాభా కు ఒక అసెంబ్లీ సీట్ పెరిగే అవకాశాలు ఉన్నందున ఆ ప్రకారంగా తెలంగాణలోని సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా పెరిగితే..
జిల్లాల వారిగా :
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 14 స్థానాలు ఉండగా మరో ఏడు స్థానాలు పెరిగి 21కి చేరనున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 14 స్థానాలు ఉండగా మరో తొమ్మిది స్థానాలు పెరిగి 23 కు చేరనున్నాయి.
మహబూబ్ నగర్ లో ఏడు స్థానాలు పెరిగి 14 నుంచి 21కి చేరనున్నాయి.
కరీంనగర్ జిల్లాలో ఆరు లేదా ఏడు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 స్థానాలు ఉన్న కరీంనగర్ లో 19 లేదా 20 స్థానాలకు చేరనున్నది.
వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలు ఉండగా మరో ఆరు స్థానాలు పెరిగి 18 స్థానాలకు పెరగనున్నది.
నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో ఆరు అసెంబ్లీ స్థానాలు పెరిగి 18 కి చేరనున్నాయి.
మెదక్ జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో అయిదు స్థానాలు పెరిగి 15 కు పెరగనున్నాయి.
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో ఐదు స్థానాలు పెరిగి 15 కు పెరగనున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లేదా ఐదు స్థానాలు పెరిగి ప్రస్తుతం పది స్థానాలు ఉన్న ఆదిలాబాద్ లో 14 లేదా 15 స్థానాలకు చేరనున్నది.
నిజామాబాద్ జిల్లాలో నాలుగు స్థానాలు పెరిగి ప్రస్తుతం 9 స్థానాలు ఉన్న అసెంబ్లీ సీట్లు 13 అసెంబ్లీ సీట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
MOST READ
- Hyderabad : పిల్లలతో కలిసి రైలుకు ఎదురెల్లి ఆత్మహత్య చేసుకున్న విజయరెడ్డి కేసు లో బిగ్ ట్విస్ట్..!
- Hyderabad : సెకండ్లలో కారు నెంబర్ ప్లేట్ చేంజ్.. సరికొత్త మోసం..!
- తండ్రి కాదు వాడు మృగాడు.. కన్న కూతురిపై అఘాయిత్యం..!
- నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో అమానవీయ ఘటన.. మానవ మృగం, తండ్రి స్థానంలో ఉండి బాలికపై అఘాయిత్యం..!









