SSC Results : క్షణాల్లోనే ఎస్ఎస్సి ఫలితాలు, వాట్సాప్ ద్వారా తెలుసుకోండి ఇలా..!
పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. రేపటి ఎస్సెస్సీ రిజల్ట్స్ ఇంటిదగ్గర నుంచే క్షణాల్లో పొందవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్ ఫోన్ లోనే ఫలితాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

SSC Results : క్షణాల్లోనే ఎస్ఎస్సి ఫలితాలు, వాట్సాప్ ద్వారా తెలుసుకోండి ఇలా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. రేపటి ఎస్సెస్సీ రిజల్ట్స్ ఇంటిదగ్గర నుంచే క్షణాల్లో పొందవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్ ఫోన్ లోనే ఫలితాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం, SSC (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు-2026ను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్ఫామ్లో అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను 29 ఏప్రిల్ 2026 (బుధవారం) మధ్యాహ్నం 2:30 గంటల నుండి వాట్సాప్ ద్వారా ద్వారా వెంటనే పొందవచ్చు.
SSC పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా సులభంగా తమ ఫలితాలను పొందవచ్చు. దీనివల్ల వెబ్సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా, వేగంగా, అత్యంత సులభంగా ఫలితాలను పొందవచ్చు. ఈ సేవను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ద్వారా అందిస్తున్నారు.
WhatsApp ద్వారా SSC ఫలితాలు పొందే విధానం:
1. మీ మొబైల్లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకోండి.
2. WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.
3. “SSC Result” అని టైప్ చేయండి.
4. మెనులో Open Service ఎంపికపై క్లిక్ చేయండి.
5. మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
6. వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో WhatsAppలో అందుతుంది.
SSC ఫలితాలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేపర్‌లెస్, ఎలాంటి క్యూలు లేకుండా, సులభమైన సేవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందించడంలో ముఖ్యమైన మైలురాయి.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో మీ సేవ ప్రజల కోసం మరింత సౌలభ్యం, పారదర్శకతతో సేవలు అందిస్తూ విస్తరిస్తోంది.
ప్రారంభం నుండి విశేష స్పందన:
18 నవంబర్ 2025న ప్రారంభించినప్పటి నుండి మీ సేవ WhatsApp/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన పొందింది. ఇది వేగంగా విస్తరించిన డిజిటల్ సేవా వేదికలలో ఒకటిగా నిలిచింది.
అత్యధికంగా ఉపయోగిస్తున్న సేవలు:
జనన సర్టిఫికేట్, ఆదాయ సర్టిఫికేట్, పోలీస్ చలాన్, విద్యుత్ బిల్, ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్, CET హాల్ టికెట్ డౌన్లోడ్లు, ఇంటర్ బోర్డు ఫలితాలు. ఇప్పుడు SSC రిజల్ట్స్.
ఇవి కూడా చదవండి :
- District Collector : జన గణన స్వీయ నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్..!
- White Hair : తెల్లజుట్టు పీకేస్తే మరింత ఎక్కువ అవుతుందా? శాస్త్రీయ వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
- Miryalaguda : హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు..!
- Pink Coffee : పింక్ కాఫీ మహిళల పాలిట సంజీవని.. ఈ రంగు కాఫీలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!









