Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : మున్సిపల్ చైర్ పర్సన్ విస్తృత పర్యటన.. ప్రజల సౌకర్యార్థం కీలక ప్రకటన..! 

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు నాలాపై బ్రిడ్జి కల్వర్టుల నిర్మాణ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి తెలిపారు.

Suryapet : మున్సిపల్ చైర్ పర్సన్ విస్తృత పర్యటన.. ప్రజల సౌకర్యార్థం కీలక ప్రకటన..! 

సూర్యాపేట, మనసాక్షి :

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు నాలాపై బ్రిడ్జి కల్వర్టుల నిర్మాణ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి తెలిపారు. బుధవారం స్థానిక వార్డు నెంబర్ 47లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.50 లక్షలతో నిర్మిస్తున్న నాలాపై బ్రిడ్జి పనులను మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంతరెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలాపై తగిన సంఖ్యలో బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రజలతో పాటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు 60 ఫీట్ల రోడ్డునుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నాలాపై రెండు బ్రిడ్జి కల్వర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ నిర్మాణాలతో ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్, 47వ వార్డు కౌన్సిలర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ ఈఈ కిరణ్, డీఈ సత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, టీపీఓ సోమయ్య, కౌన్సిలర్లు కొణతం రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్, గుణగంటి సతీష్, పొలగని కృష్ణా, నరేందర్ నాయుడు, మున్సిపల్ ఏఈ రాజురెడ్డి, ఎండీ గౌసుద్దీన్, ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు