Devarakonda : భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ..!
త్యాగానికి, విశ్వాసానికి, బక్రీద్ పండగ అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. గురువారం చింతపల్లి మండలం కేంద్రంలోని ఈద్ గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులను కలుసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Devarakonda : భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ..!
త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీద్..
దేవరకొండ ఎమ్మెల్యే నేనా వత్ బాలు నాయక్.
చింతపల్లి, మనసాక్షి :
త్యాగానికి, విశ్వాసానికి, బక్రీద్ పండగ అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. గురువారం చింతపల్లి మండలం కేంద్రంలోని ఈద్ గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులను కలుసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రవక్త ఇబ్రహీం లైసెహి సలాం త్యాగం, విశ్వాసం మానత విలువలను స్మరించుకుంటు జరుపుకునే బక్రీద్ పండగ సమాజానికి ఐక్యత, సహనం, పరస్పర ప్రేమ ఆప్యాయత సందేశాన్ని అందిస్తుందని వారు పేర్కొన్నారు.
బక్రీద్ పవిత్ర పండగని బక్రీద్ పండగ ప్రతి కుటుంబంలో, ఆనందం శాంతి సౌభాగ్యాలను నింపాలని వారు భగవంతుని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవించడం రాష్ట్ర ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, మదరాస గురుకుల విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
రాష్ట్రంలో ఎలాంటి మత ఘర్షణలకు తావివ్వకుండా ప్రజా సంక్షేమ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మైనార్టీ మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముచ్చర్ల యాదగిరి, స్థానిక సర్పంచ్, కాసారం శ్వేతా శ్రీనివాస్ ఎండి జహంగీర్, ఎలిమినేటి నరసింహ ఎండి రియాజ్ పాషా, వందనపు ఆంజనేయులు, గోవిందు రవి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









