Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : భూమి ఇవ్వకపోతే ట్రాక్టర్‌తో తొక్కిస్తా.. వృద్ధ దంపతులను చంపేస్తానని బెదిరించిన కన్నకొడుకు..!

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆస్తి వివాదం కారణంగా చంపేస్తానని కన్నకొడుకు బెదిరించాడని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Miryalaguda : భూమి ఇవ్వకపోతే ట్రాక్టర్‌తో తొక్కిస్తా.. వృద్ధ దంపతులను చంపేస్తానని బెదిరించిన కన్నకొడుకు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆస్తి వివాదం కారణంగా చంపేస్తానని కన్నకొడుకు బెదిరించాడని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ‘కారుణ్య మరణానికి’ అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్డీవోను వృద్ధ దంపతులు ఆశ్రయించారు.

రక్షించాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని  వేములపల్లి పోలీసులను ఆశ్రయించగా దురుసుగా ప్రవర్తించారని, దీంతో తమను కాపాడాలంటూ ఆర్డీవోను ఆశ్రయించారు. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ దంపతులు ఆర్డీఓ రమణారెడ్డి కి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు.

తమకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచారు.. తమ వైద్య ఖర్చుల కోసం వృద్ధ దంపతులు మూడు ఎకరాల 11 గుంటల భూమిని తమ వద్ద ఉంచుచుకున్నారు. కాగా ఆ భూమిని తమను చూసుకుంటున్న మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దానిలో కూడా వాటా ఇవ్వాలని పెద్ద కుమారుడు వేధిస్తున్నాడని ఆర్డీఓ కి పిర్యాదు చేశారు.

గతంలో వీల్‌చైర్‌లో ఉన్న తనపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినా.. వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ట్రాక్టర్‌తో తొక్కిస్తామని బెదిరింపులు చేస్తున్నారని వాపోయారు. రక్షణ కోసం వేములపల్లి పోలీసులను ఆశ్ర యించగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు