WhatsApp : వాట్సప్ యూజర్లకు బిగ్ షాక్.. సస్పెండ్ అవుతున్న ఎకౌంట్లు.. ఎందుకంటే..!
అతిపెద్ద మెసేజింగ్ యాప్ వాట్సప్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది నియోగదారులు ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సప్ గా ఉంది. అతి చిన్న విషయానికి కూడా వాట్సాప్ యూజ్ చేస్తున్నారు.

WhatsApp : వాట్సప్ యూజర్లకు బిగ్ షాక్.. సస్పెండ్ అవుతున్న ఎకౌంట్లు.. ఎందుకంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అతిపెద్ద మెసేజింగ్ యాప్ వాట్సప్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది నియోగదారులు ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సప్ గా ఉంది. అతి చిన్న విషయానికి కూడా వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. అయితే ఖాతాలను ఉన్నపలంగా సస్పెండ్ చేస్తూ 24 గంటల సమీక్ష పరిధిలోకి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. కొంతమంది వాట్సప్ యూజర్ ను ఎలాంటి కారణం లేకుండానే ఖాతాలను నిలిపివేస్తుంది. దాంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని బాధితులు సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ తో సహా పలు దేశాలలో వాట్సప్ వినియోగదారులకు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సోమవారం రాత్రి 8 గంటల నుంచి కొన్ని ఖాతాలు నిలిపివేయబడ్డాయి. దాంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సప్ ఓపెన్ చేయగానే ఎకౌంటు ఇన్ రివ్యూ అని చూపిస్తూ నిబంధనలను ఉల్లంఘించారో..? లేదో..? నిర్ధారించుకోవడానికి ఖాతా కార్యకలాపాలను డివైస్ సమాచారాన్ని పరిశీలిస్తున్నామని, 24 గంటల్లో ఫలితాన్ని తెలియజేస్తామని మెసేజ్ ప్రత్యక్షమైంది.
ఇలాంటి సాంకేతిక లోపంపై వాట్సప్ యాజమాన్య సంస్థ మెట్ట కూడా స్పందించింది. ఆటోమేటెడ్ సెక్యూరిటీ సిస్టం దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థ లోపం కారణంగా కొన్ని నిజమైన ఖాతాలు కూడా ఫ్లాగ్ అయ్యాయని వివరణ ఇచ్చింది. వినియోగదారుల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తామని ఈ క్రమంలోనే కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయని అలాంటి లోపాలు జరిగినప్పుడు వీలైనంత త్వరగా సరిదిద్ది వినియోగదారులకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని వాట్సప్ పేర్కొన్నది. అయితే ఖాతాదారులకు తిరిగి ఖాతాలను పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టింది.
MOST READ
- Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. 855.10 అడుగులకు చేరిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
- Braking News : చిట్టీల పేరుతో టోకారా, బీజేపీ దూకుడుకు బ్రేక్, కొడుకు హత్య.. మన సాక్షి టాప్10 ఫ్లాష్ న్యూస్..!
- Hyderabad : జ్యువెలరీ షాపులో చోరీ.. 7 తులాల బంగారం..4 కిలోల వెండి అపహరణ..!
- Miryalaguda : మిర్యాలగూడలో చింతపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. మృతి చెందిన మహిళ, బిఎల్ఆర్ పరామర్శ..!









