Home for Labourers : కూలీలకు నివాసంగా మారిన పాఠశాల..!

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాల కూలీలకు నివాసంగా మారింది. గత ఏడాది 30 మంది విద్యార్థులు ఉండగా ఏడాది రికార్డుల్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ.. పాఠశాలకు వచ్చేది మాత్రం ముగ్గురే.

Home for Labourers : కూలీలకు నివాసంగా మారిన పాఠశాల..!

చింత బావి గ్రామంలో విద్యార్థులు బడికి వెళ్లలేని పరిస్థితి

దేవరకొండ, మనసాక్షి:

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాల కూలీలకు నివాసంగా మారింది. గత ఏడాది 30 మంది విద్యార్థులు ఉండగా ఏడాది రికార్డుల్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ.. పాఠశాలకు వచ్చేది మాత్రం ముగ్గురే. వారికి పాఠాలు బోధించే ఉపాధ్యాయులు రికార్డుల్లో ఇద్దరు ఉన్నా… రోజుకు ఒక్కరే పాఠశాలలో కనిపిస్తారు. ఇది నలగొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో చింత బావి ప్రాథమిక పాఠశాలలో నెలకొన్నది.

ఇక్కడ విద్యార్థుల పరిస్థితి, భవిష్యత్తు గురించి ఆలోచించే వారే లేరు. సమీపంలోని రోడ్డు పనులు జరుగుతుండగా వారికి పాఠశాలలో ఆశ్రయం ఇచ్చారు. పాఠశాలలో నివాసం ఉంటూ.. రోడ్డు పని చేస్తున్నారు. వారిని అడిగే వారే లేకుండా పోయారు.

గురువారం యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది జిల్లా కమిటీ సభ్యులు మొహమ్మద్ సౌభన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పే ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వీటిని చూసి చూడనట్టుగా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇంతకీ ఇదంతా కాంప్లెక్స్ హెచ్ఎం అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డ్యూటీ కి రావాల్సిన టీచర్స్ కి అంతా తెలిసే జరుగుతుందని అన్నారు.

విద్యార్థి సంఘ నాయకులు మండలంలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ పాఠశాలలో బడికిపోను పంతుల గురించి విన్నపించిన కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు గ్రామాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగు వర్గ విద్యార్థులను విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

MOST READ : 

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

BREAKING : మిర్యాలగూడ లో ఘోరం.. రైస్ మిల్లు గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి..!