ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

మహబూబ్ నగర్, మన సాక్షి :

లంచం తీసుకుంటుండగా పంచాయితీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ 4,41,321 రూపాయలతో రెండు సిసి రోడ్లు గ్రామంలో నిర్మించారు.

 

ఈ పనులను గత ఏడాది మార్చిలో పూర్తి చేశారు. బిల్లులను చెక్కు రూపంగా సువర్ణకు పంచాయతీ కార్యదర్శి పాండురంగం అందజేశారు. కాగా బిల్లులో తనకు 20వేల రూపాయలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి డిమాండ్ చేశారు. దాంతో సువర్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.

 

సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి పాండురంగానికి సువర్ణ 5 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. పాండురంగం ను మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్న వారిలో ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్, ఇన్స్పెక్టర్లు లింగస్వామి, జిల్లాని, అధికారులు ఉన్నారు.

 

ALSO READ : 

1. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!

2. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?

3. Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!