విమానంలో ఘర్షణ, సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)

విమానంలో ఘర్షణ, సోషల్ మీడియాలో వైరల్

న్యూఢిల్లీ , మనసాక్షి : విమానంలో ఇద్దరు మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం సోషల్ వైరల్ గా మారింది. వివరాల ప్రకారం థాయ్ స్మైల్ ఎయిర్వేస్ లో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి కోల్ కత్తా వెళ్తున్న విమానంలో ఈ ఘటన ఈ నెల 26న టేక్ ఆఫ్ అవుతుండగా జరిగింది. ఆ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి… నీ చేయి కిందికి దించు అనటం వినిపించింది.

ఆ తర్వాత ఆ వ్యక్తిని తోటి ప్రయాణికులు అనేకసార్లు కొట్టినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇతర ప్రయాణికులు ఎయిర్ హోస్టన్ తో కలిసి వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే విమానంలో జరిగిన వివాదంపై థాయ్ స్మైల్ ఎయిర్వేస్ స్పందించి.. గొడవకు సంబంధించిన నివేదికను ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సమర్పించింది. ప్రయాణికుడు భద్రత నియమాలను పాటించడానికి నిరాకరించినట్లు వేదికలో పేర్కొంది.