Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతరలురాజకీయం

Annamayya : ఘనంగా నారుమాకుల గంగజాతర.. దర్శించుకున్న నిసార్ అహ్మద్..!

నారమాకుల గంగమ్మ జాతర ఉత్సవాల్లో వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆత్మీయ ఆహ్వానం మేరకు మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ పాల్గొన్నారు.

Annamayya : ఘనంగా నారుమాకుల గంగజాతర.. దర్శించుకున్న నిసార్ అహ్మద్..!

మసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రూరల్ మండలం, పొన్నుటిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని పనసమాకులపల్లెలో నిర్వహించిన నారమాకుల గంగమ్మ జాతర ఉత్సవాల్లో వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆత్మీయ ఆహ్వానం మేరకు మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్. నిసార్ అహమద్ మాట్లాడుతూ, నారమాకుల గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగి ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు రాజేశ్, కె.వి. రమణ, నజీర్ హార్దిక స్వాగతం పలికారు.

ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, ఎల్ రఘునాథ్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, కొత్తపల్లి మహేశ్, కొత్తపల్లి నాగార్జున నాయుడు, శంకర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, చెన్నకృష్ణ, దామోదర్, మాలేపాడు చలపతి, నాసిర్, షేక్ జబీ, అబ్దుల్లా తదితరులతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు