Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Telangana : దేశంలో ఇండియా కూటమిదే అధికారం.. ఉత్తంకుమార్ రెడ్డి ధీమా..!

Telangana : దేశంలో ఇండియా కూటమిదే అధికారం.. ఉత్తంకుమార్ రెడ్డి ధీమా..!

మన సాక్షి, మిర్యాలగూడ:

దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని, అధికారం చేపట్టబోతుందని నీటిపారుదల శాఖ మంత్రి నల్లమల ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపుకు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు.

బిజెపి తెలంగాణలో కొత్త నాటకాలు ఆడుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నరేంద్ర మోడీ అవమానపరచాడన్నారు. తెలంగాణకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ రెట్టింపు చేయకపోగా రైతు ఆదాయం తగ్గిందని, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదన్నారు. అదే విధంగా రైతులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం అన్నారు.

మరోసారి బిజెపి గెలిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు. వ్యక్తి స్వేచ్ఛ కూడా ముందు ముందు ఉండదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే అన్ని వ్యవస్థలకు బీజేపీతో ప్రమాదకరం అన్నారు. మిర్యాలగూడలో అనేక రైళ్లు ఆగేందుకు తాను కృషి చేశానని, వందే భారత్ రైలు నిలిపేందుకు కూడా క్రుషి చేసినట్లు తెలిపారు. రఘువీర్ రెడ్డి కాబోయ్ పార్లమెంట్ సభ్యులని మెరుదైన సేవ చేస్తాడని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ALSO READ : Telangana : కెసిఆర్ , కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై మిర్యాలగూడ సభలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!

నీటిపారుదల, రోడ్డు భవనాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి , నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి , నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ మిర్యాలగూడ భారతి రాగ్యా నాయక్ , నియోజకవర్గం నాయకులు స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి , నూకల వేణుగోపాల్ రెడ్డి , తమ్ముడ బోయిన అర్జున్, పగిడి రామలింగయ్య , ముదిరెడ్డి నర్సిరెడ్డి, చిలుకూరు బాలు, శాగా జలంధర్ రెడ్డి , రుణాల్ రెడ్డి , దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, మహబూబ అలీ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

Raghu veer: జయహో రఘువీరా పాట ఆవిష్కరణ.. బి ఎల్ ఆర్ నేతృత్వంలో రూపొందించిన పాట..!

మరిన్ని వార్తలు