Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Suspended : కొమురవెల్లి ఎస్సై, కానిస్టేబుల్ ల సస్పెన్షన్..!

Suspended : కొమురవెల్లి ఎస్సై, కానిస్టేబుల్ ల సస్పెన్షన్..!

దుబ్బాక, మనసాక్షి :

పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురవెల్లి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజు తో పాటు, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి ఎ. వి. రంగనాథ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి…. కొమురేల్లి ఎస్.ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఇరువురు పోలీస్ అధికారులపై ఆరోపణలు రావడంతో పాటు ఎస్ఐ నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసినట్లుగా వివిధ మీడియా మధ్యమాల్లో ప్రచారం అయ్యింది.

దీంతో ఈ ఘటనపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ పరాయి స్త్రీ లతో సహజీవనం చేస్తున్నందుకు ఎస్ ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐ జి పి ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ : 

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

మరిన్ని వార్తలు