సమ్మోహనం…లహరి కూచిపూడి ఆరంగేట్రం

సమ్మోహనం…లహరి కూచిపూడి ఆరంగేట్రం

జార్జియా (అమెరికా) , మనసాక్షి డెస్క్ : తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి, వాసవి పిసెకె దంపతుల కుమార్తె అయిన లహరి 8 వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి ఆదివారం నాడు తొలి ఆరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది.

కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది.

తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవిలతో లహరి. వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి 

1. BREAKING : వేములపల్లిలో విద్యుత్ ఘాతంతో రైతు మృతి

2. BREAKING : తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు – మోడీ

3. ఎన్ఐఏ కస్టడీలో ఉదయపూర్ నిందితులు