Latest News : బస్ మిస్ కావడంతో.. లిఫ్ట్ ఇచ్చి, అంత దారుణమా..!

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్లి గ్రామ శివారు వద్ద మే 14 2024 మంగళవారం రోజున జరిగిన అంగన్వాడీ టీచర్ రడం సుజాత పై జరిగిన అత్యాచారం, మర్డర్ కేసులో పోలిసులు నిందితులను అరెస్టు చేశారు.

Latest News : బస్ మిస్ కావడంతో.. లిఫ్ట్ ఇచ్చి, అంత దారుణమా..!

72 గంటల్లోనే మర్డర్ కేసు నిందితులు అరెస్ట్

తాడ్వాయి, మన సాక్షి ప్రతినిధి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్లి గ్రామ శివారు వద్ద మే 14 2024 మంగళవారం రోజున జరిగిన అంగన్వాడీ టీచర్ రడం సుజాత పై జరిగిన అత్యాచారం, మర్డర్ కేసులో పోలిసులు నిందితులను అరెస్టు చేశారు. స్థానికంగా సంచలనాత్మకంగా మారిన అంగన్వాడీ టీచర్ సుజాత హత్య కేసును ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు పోలిసులు 72 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.

శుక్రవారం తాడ్వాయి పోలీసు స్టేషన్ లో పోలీసులు నిందితు లను విలేకరుల సమావేశంలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ములుగు డీఏస్పీ రవీందర్, పస్రా సీఐ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఏస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి లు మాట్లడుతూ మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు విచారణ చేపట్టి పస్రా సీఐ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఎస్సె ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీల ఆధారంగా, వారి కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు.

చిన్నబోయిన పల్లి గ్రామానికి చెందిన రడం సుజాత14 వ తేదిన అంగన్వాడీలో విధులు ముగించుకొని తిరిగి చిన్నబోయినపల్లి లోని తన ఇంటికి వెళ్లడం కోసం బస్ స్టాండ్ కి రాగా బస్ మిస్ అవడంతో అంతకుముందే పరిచయం ఉన్న ఆకుదారి రామయ్య సుజాతను కాటాపూర్ నుండి లిఫ్ట్ ఇవ్వడం కోసం బైక్ ఎక్కించుకున్నాడని, అప్పటికే ఆకుదారి రామయ్య నాంపల్లి గ్రామా శివారులోని నీళ్ల ఒర్రె వద్ద పగిడి జంపయ్యని దించడం జరిగిందని తర్వాత ఆకుదారి రామయ్య నీళ్ల ఒర్రె వద్దకు మృతురాలిని తీసుకెళ్లి అక్కడ ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య ఇద్దరూ ఆమెను అడవిలో కొద్దీ దూరం తీసుకెళ్లి హత్యచారం చేసి ఆమె మెడలోని బంగారు గోపి తాడును లాక్కునే ప్రయత్నం చేశారు.

ఆమె ప్రతి ఘటించడంతో పగిడి జంపయ్య ఆమె తలపై రాయితో కొట్టి ఆమె స్కార్ఫ్ తో మెడకు చుట్టి హత్య చేసి మృతురాలు సుజాత మెడలోంచి 3 తులాల బంగారు గోలుసు తీసుకుని మృతురాలి హ్యండ్ బ్యాగ్ను, మొబైల్ ఫోన్ ను అడవిలో దూరంగా పడవేసి తిరిగి వారి గ్రామం అయిన రొయ్యూర్కు వెళ్లిపోయారిన పోలిసులు తెలిపారు.

కాగా శుక్రవారం 17 న ఉదయం కాటాపూర్ క్రాస్ వద్ద పసర సర్కిల్ సీఐ శంకర్, తాడ్వాయి ఏస్సె శ్రీకాంత్ రెడ్డి, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ పై తాడ్వాయి వైపు నుండి వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు పోలిసులను చూసి పారిపోతుండగా పట్టుకొవడం జరిగింది తెలిపారు.

కాగా నిందితులు ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రామయ్య(45) తండ్రి పోశాలు, పగిడి జంపయ్య (42) తండ్రి, ఎర్ర సమ్యయ్య గా, గుర్తించామని నిందితుల వద్ద నుండి 1,) మోటార్ సైకిల్ హీరో గ్లామర్ టీఎస్16ఈకే3264, 2,) మూడు తులాల రెండు వరుసల గోపి తాడు, పుస్తెలు 3,) హాండ్ బ్యాగ్, అందులో ఉన్న మృతురాలి బ్యాంక్ పాస్ బుక్స్, ఆధార్ కార్డ్ ను స్వాధీన పరుచుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ములుగు డీ ఏస్పీ రవీందర్ తెలిపారు.

నిందితులను పట్టుకోవడంలో చాక చక్యంగా వ్యవహరించిన పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఏస్సె శ్రీకాంత్ రెడ్డి, ఏఏస్సె చింతనారాయణ, హెచ్ సీ కిషన్, పీసిఏస్ పూజారి రమేష్, జాజా సాంబయ్య, అప్పాల రమేష్, గోపు రాజీవ్, కాసగోని రాజేష్ లను పోలీసు ఉన్నాతా ధికారులు అభింనందిచారు.

MOST READ : 

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!