Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత..!

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆదివారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ ,చింతపల్లి , కొండమల్లేపల్లి ప్రాంతాలలో పోలీసులు భారీగా నగదు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున అన్నారు. ఆదివారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాహనాలు తనిఖీలు చేస్తుండగా… నందిపహాడ్ క్రాస్ రోడ్ వద్ద ఒక వ్యక్తి నుండి 1,60,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఎటువంటి ఆధారాలు చూపించినందున అట్టి నగదును సీజ్ చేసి జిల్లా ట్రెజరీ ఆఫీస్ కి పంపించడం జరిగిందని సిఐ నాగార్జున తెలిపారు.ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Devarakonda : వాహనాల తనిఖీల్లో నగదు స్వాధీనం

దేవరకొండ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేయుచుండగా కొంత మంది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తీసుకొని వెళ్లుతుండగా వారి దగ్గర డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ నరసింహులు తెలిపారు.

రాగి హనుమంతు, 120,500/-, ఎర్గవారం కురుమయ్య గ్రామం 1,12,000/- బెజ్జికంటి శంకరయ్య 1,02000/- మూడవత్ బాలు వద్ద 50,000/- దామెర శ్రీనయ్య 50,000/- కోట్ల స్వామి 50,000/- అను వ్యక్తులు లోకసభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఎన్నికల కొడ్ కు విరుద్ధంగా అనుమతులకు మించి డబ్బు తరలిస్తుండగా పంచనామా నిర్వహించి డబ్బులు స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది.

పోలీసుల తనిఖీలలో 2.15 లక్షల నగదు పట్టివేత

కొండమల్లేపల్లి :

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కొండ మల్లేపల్లి పట్టణంలోని హైదరాబాదు రోడ్డు లో ఎస్ఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి దగ్గర నుంచి సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 2.15 లక్షల నగదును పట్టుకొని స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

 

తనిఖీల్లో 70 వేల నదులు పట్టివేత

చింతపల్లి :

మండల పరిధిలోని గోడకొండ్ల రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ వద్ద చింతపల్లి ఎస్ ఐ బి యాదయ్య ఆదివారం ఎస్ ఎస్ టి టీం తో వాహనాలను తనిఖీ చేస్తుండగా లోక్సభ ఎన్నికల కొడుకు విరుద్ధంగా డబ్బులు త్వరగా పట్టుకున్నారు. కృష్ణాజిల్లా సుబ్బయ్య గూడెం గ్రామానికి చెందిన మారుపోవు సుబ్బయ్య అనే వ్యక్తి తన వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా 70. వేల రూపాయలు తరలిస్తుండగా పట్టుబడి చేసి ఆ డబ్బులు స్వాధీనం చేసుకొని నల్లగొండ డి టి ఓ అప్పగించినట్లు ఎస్సై బి యాదయ్య పేర్కొన్నారు.

MOST READ :