రోడ్డు ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు…!

రోడ్డు ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు…!

నాగిరెడ్డిపేట్ , మనసాక్షి :

నాగిరెడ్డిపేట్ : తుఫాన్ వాహనం ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ అనే వ్యక్తి నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో భార్య పిల్లలతో కలిసి హోటల్ నడుపుతూ జీవిస్తున్నాడు.

 

శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు తనూష్ (6) మండల కేంద్రంలో రాత్రి 9 గంటల సమయంలో రోడ్డు దాటుతూ ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్ నుండి బాన్సువాడ వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం తనూష్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తనూష్ కు తీవ్ర గాయాలయ్యాయి.

 

ALSO READ : 

  1. అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యం
  2. అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య..!
  3. అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి
  4. కల్వకుర్తి పట్టణంలో దొంగల బెడద
  5. BREAKING : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు..!

 

తనూష్ ను చికిత్స కోసం తల్లిదండ్రులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.తనూష్ ను ఢీకొట్టిన తుఫాన్ వాహన డ్రైవర్ వాహనంతో పరార్ కాగా స్థానికులు గమనించి వాహనాన్ని వెంబడించి తాండూర్ గేటు సమీపంలో పట్టుకున్నారు.

 

రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగానే స్థానిక ఎస్సై రాజు సిబ్బందితో కలిసి ఢీ కొట్టిన వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.