Sagar Left Cenal : కాలువ కట్టల పై గస్తీ.. మోటార్లు తొలిగింపు..!

తాగునీటి నివారణ కోసం విడుదల చేసిన నీళ్లు సక్రమంగా ఖమ్మం జిల్లా కేంద్రం కు చేరేలా అధికారయంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ కాలువ ద్వారా ఖమ్మం ప్రజల తాగునీటి కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా, నీటి చోరీ లేకుండా నీటిని పంపిచేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టారు.

Sagar Left Cenal : కాలువ కట్టల పై గస్తీ.. మోటార్లు తొలిగింపు..!

నీటి చోరి నియంత్రణ కు ముందస్తు చర్యలు.

అడుగడుగునా పహారా లో అధికారులు.

నేలకొండపల్లి, మన సాక్షి :

తాగునీటి నివారణ కోసం విడుదల చేసిన నీళ్లు సక్రమంగా ఖమ్మం జిల్లా కేంద్రం కు చేరేలా అధికారయంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ కాలువ ద్వారా ఖమ్మం ప్రజల తాగునీటి కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా, నీటి చోరీ లేకుండా నీటిని పంపిచేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టారు.

కూసుమంచి మండలం నుంచి ఖమ్మం పట్టణం వరకు కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్ ఖమ్మం అర్బన్ ఆయా మండల అధికారులు గస్తీ ఉంచారు.
నేలకొండపల్లి మండలం లోని మోటాపురం. రాజేశ్వరపురం, అమ్మగూడెం అరగూడెం గ్రామాల కాలువ సరిహద్దు వరకు మండలఅధికారులు గస్తీ కాస్తున్నారు.

నీటి సరఫరా ఇంకా జరగకముందే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాలువ కట్టల కు ఇరువైపులా ఉన్న వ్యవసాయ మోటార్ల ఫీజ్లను తొలిగించారు. మరి కొన్నింటిని మోటార్లను తీసేశారు. అమ్మగూడెం, రాజేశ్వరపురం వద్ద ఉన్న యూటీ ల నుంచి చుక్కనీరు కూడ కిందకు రాకుండా బస్తాలతో యూటీలను బంద్ చేశారు. కాలువ కట్టల పై రైతులు వచ్చి నీటి కోసం లాక్ లు ఎత్తుకుండా కాపలా ( గస్తీ) కాస్తున్నారు. కాలువ కట్ట పై అడుగడుగునావివిధ శాఖల అధికారులు పహారా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యం.యర్రయ్య, నేలకొండపల్లి ఎస్సై తోట నాగరాజు, మిషన్ భగీరధ డీఈఈ ఓం ప్రకాష్, ఇరిగేషన్ డీఈఈ మన్మధరావు, ఏఈ నరేష్ , విద్యుత్ శాఖ అధికారులు లతో పాటు 10 పంచాయతీల కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. నీటి సరఫరా పూర్తయ్యే వరకు రాత్రింబవళ్లు వీరంతా కాలువ కట్టల పై విధులు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు :