Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : తెలంగాణ ఏర్పడక ముందు చుక్క నీరు లేని పరిస్థితి..!

సూర్యాపేట : తెలంగాణ ఏర్పడక ముందు చుక్క నీరు లేని పరిస్థితి..!

మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి :

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణ కోటి వృక్షార్చన కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

 

విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిదులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చ‌న కార్యక్రమం అద్భుతమైనది అని కొనియాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.

 

హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడిందన్న మంత్రి,సకాలంలో వర్షాలు పడుతుండ‌టంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు కు ముందు చుక్క నీరు లేని పరిస్థితుల నుంచి నీరు ఇక చాలు అనే స్థాయికి వ‌చ్చాంమంటే ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయిందన్నారు.

 

MOST READ : 

  1. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
  2. How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
  3. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
  4. భయంతోనే ఆయనకు మంత్రి పదవి : రేవంత్ రెడ్డి
  5. Nallamothu : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కు భారీ సన్మానం..!

 

హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 7.7 శాతం గ్రీనరీ పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలి అని మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

 

కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, మునిసిపల్ కోఆప్షన్ స్వరూప , మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

  1. కల్వకుర్తి : బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తి.. ఏకపక్ష నిర్ణయంతో పార్టీకి నష్టం..!
  2. మిర్యాలగూడ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్..!
  3. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం
  4. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  5. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

మరిన్ని వార్తలు