BIG BREAKING : సూర్యాపేటలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..!
BIG BREAKING : సూర్యాపేటలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..!
సూర్యాపేట, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
చనిపోయిన వారిలో మొహమ్మద్ నవీన్, నిఖిల్ రెడ్డి, రాకేష్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఆదిత్యను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సూర్యాపేట పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
Telangana : ఆ కంపెనీ దగ్గర రూ.300 కోట్లు తీసుకొని ఢిల్లీకి పంపింది నిజం కాదా..?
Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!









