Miryalaguda : ప్రైవేట్ స్కూల్ ఫీజులను దోపిడీని అరికట్టాలి..!
Miryalaguda : ప్రైవేట్ స్కూల్ ఫీజులను దోపిడీని అరికట్టాలి..!
అడ్మిషన్ ఫీజు పేరిట 3,500 వసూలు
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలో విద్యా వ్యాపారం జోరుగా కొనసాగుతున్నప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం సమావేశంలో యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు.
నియోజకవర్గంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా విద్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి దోపిడికి అదుపు లేకుండా పాఠశాలలో చేరే విద్యార్థి అడ్మిషన్ పేరిట 3,500 రూపాయలు వసూలు చేయడం మే కాక పాఠశాల ఫీజుల పేరిట లక్షల రూపాయలు దండుకుంటున్నారు.
అంతేకాక వారి పాఠశాలలో చదివే విద్యార్థులకు వారి పాఠశాలలలో నే టెస్ట్ బుక్స్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఆర్లపూడి శ్రీనివాస్, చిలకల మురళి యాదవ్, సిద్ధం రాజు, నరేష్, గంగాధర్, హరి గౌడ్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!









