Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!
Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. అనర్హలు సైతం తప్పుడు సమాచారంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. దాంతో అధికారులు సర్వే నిర్వహించిన సమయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కుల గణన ఆధారంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు అధికారులు జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సర్వే నిర్వహించారు.
21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలలో అర్హుల జాబితాను వెల్లడించారు. కాగా రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఒకటవ వార్డు పరిధిలో 35 కొత్త రేషన్ కార్డులకు ధరఖాస్తులు రాగా వారిలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉండడంతో సర్వే చేసిన అధికారులు కంగుతిన్నారు.
రేషన్ కార్డు కోసం రైల్వే ఉద్యోగి, బ్యాంకు ఉద్యోగి సైతం దరఖాస్తులు చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు వారిని అనర్హులుగా గుర్తించాల్సి వచ్చింది. అదేవిధంగా మరో అయిదు కుటుంబాల వారు స్థానికేతరులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వారిని కూడా అనరులుగా గుర్తించారు.
గ్రామ సభలలో డబుల్ దరఖాస్తులు :
రేషన్ కార్డుల కోసం గ్రామసభలలో మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారు సైతం మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా వేరేచోట రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల వారు కూడా మిర్యాలగూడ పట్టణంలో మరోసారి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల అధికారులకు తలనొప్పిగా మారింది. గ్రామసభలలో స్వీకరించే దరఖాస్తుల సర్వే ఎప్పుడు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.
MOST READ :
-
Chevelle : సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయి.. ఎమ్మెల్యే యాదయ్య..!
-
District collector : గ్రామసభలో సమయపాలన పాటించాలి.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!
-
Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!









