Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!

District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!

నడిగూడెం, మన సాక్షి:

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాగిత రామచంద్రపురం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ఇండ్ల నిర్మాణాల పరిశీలన సందర్భంగా నీలం శైలజ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆమెతో మాట్లాడుతూ పునాది పూర్తి అవ్వగానే లక్ష రూపాయలు అకౌంట్ లో పడినాయా అని అడగగా లక్ష రూపాయలు వచ్చాయని యజమానురాలు సంతోషంగా కలెక్టర్ కి తెలిపారు. గ్రామంలో బేస్మెంట్ లెవెల్ పూర్తి అయిన 35 మంది లబ్ధిదారులకు వారి అకౌంట్ లో లక్ష రూపాయల బిల్లులు జమ అయినట్లు హౌసింగ్ ఏఈ జై మూర్తి కలెక్టర్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, ఆర్డీఓ సూర్యనారాయణ, ఎడిఎ యల్లయ్య, మండల ప్రత్యేక అధికారి సతీష్ కుమార్, తహసీల్దార్ సరిత, ఎంపిడిఓ సంజీవయ్య, పిఎసిఎస్ చైర్మన్ లు కొల్లు రామారావు,గోసుల రాజేష్, పంచాయతీ కార్యదర్శిలు ఉమారాణి,అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

  2. Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!

  3. Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

  4. Miryalaguda : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష.. పోలీసులకు ఫిర్యాదు..!

  5. అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!

మరిన్ని వార్తలు