Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్

ఘనంగా చమ్మర్తి జగన్మోహన్ రాజు జన్మదిన వేడుకలు..!

ఘనంగా చమ్మర్తి జగన్మోహన్ రాజు జన్మదిన వేడుకలు..!

రామసముద్రం, మనసాక్షి :

పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి విద్యా సంస్థల అధినేత రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన సిద్దవటం లోని మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష, కార్యాలయంలో సోమవారం భారీ కేక్ కట్ చేసి ఉచిత వైద్య సేవలు అందించారు.

ఈ సందర్భంగా టిడిపి మాజీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నేత శనివారపు మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఒక పండుగ వాతావరణం గా ఉందని ఎంతోమందికి తమ విద్యాసంస్థల ద్వారా విద్యార్థులకు విద్యను అందించి నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి చమ్మర్తి జగన్మోహన్ రాజ్ కి దక్కుతుందని తెలిపారు.

సింగిల్ అధ్యక్షులు దారపునేని దశరథ నాయుడు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక పట్టుదల కృషితో ముందుకెళ్తున్న ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు జన్మదిన వేడుకలు కార్యకర్తలకు నూతన ఉత్సాహం ఏర్పడిందన్నారు.

మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష మాట్లాడుతూ టిడిపి పార్టీ బలోపేతానికి ఆయన ఎనలేని సేవ చేసి కార్యకర్తలకు కుల మత తేడా లేకుండా అండగా నిలబడుతున్నాడని అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన చేస్తున్న సేవలు అభినందనమయం అని ఇలాంటి జన్మదిన వేడుకలు కార్యకర్తల మధ్య కోలాహాలంగా భారీ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు, రాష్ట్ర దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు, మండల టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ శంకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బాలిరెడ్డి, నిత్య పూజ కోన ఆలయ ట్రస్టు చైర్మన్ రాజేంద్రప్రసాద్,

మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష, మాజీ మండల కన్వీనర్ మామిడి వెంకట సుబ్బారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వీరనాల రామచంద్రయ్య, టిడిపి నేతలు పిచ్చిరెడ్డి, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. DSP : సైకిల్ పై వెళ్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పీ మహేంద్ర..!

  2. District collector : జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో వారికి నోటీసులు..!

  3. Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు