ముఖంపై మొటిమల సమస్యతో
యువతి ఆత్మహత్య
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లా బిసంద పోలీస్ సర్కిల్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో ఉన్న యువతి ముఖంపై మొటిమల సమస్య తో పెళ్లి సంబంధాలు కుదరట్లేదనీ మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్ని చికిత్సలు చేసినా తమ కుమార్తెకు మోటిమలు తగ్గలేదని, పెళ్లి సంబంధాలు కుదరక చనిపోయిందని యువతి తల్లి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బిసాండ పోలీస్ సర్కిల్ ఇన్ ఛార్జ్ కేకే పాండే తెలిపారు.
ఇది కూడా చదవండి
1. కెసిఆర్ పర్యటనకు సడన్ బ్రేక్.. హైదరాబాద్ కు తిరిగొచ్చింది అందుకేనా ?
2. కాంగ్రెస్ లో చేరిన 8 మంది మాజీ ఎమ్మెల్యేలు
3. ఫ్లాష్… ఫ్లాష్.. మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు









