Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Nalgonda : నల్లగొండ జిల్లా ఆణిముత్యం సాన్వీ సాగర్..!

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల పట్టణ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సంద పట్ల లక్ష్మణ్ సాగర్- ప్రేమలత ల కుమార్తె సందుపట్ల సాన్వి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 1393 వ ర్యాంకు సాధించి విశిష్ట విజయం సాధించింది.

Nalgonda : నల్లగొండ జిల్లా ఆణిముత్యం సాన్వీ సాగర్..!

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026లో గొడకొండ్ల విద్యార్థి సాన్వి విజయం

చింతపల్లి, మనసాక్షి:

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల పట్టణ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సంద పట్ల లక్ష్మణ్ సాగర్- ప్రేమలత ల కుమార్తె సందుపట్ల సాన్వి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 1393 వ ర్యాంకు సాధించి విశిష్ట విజయం సాధించింది.

ఈ విద్యార్థిని సాన్వి ప్రస్తుతం గొడకొండ్ల గ్రామంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది.
ప్రత్యేకంగా గణిత శాస్త్రంలో 150/150 పూర్తి మార్కులు సాధించడం ఆ విద్యార్థిని కృషి, ప్రతిభ, క్రమశిక్షణకు నిదర్శనం.

ఈ ఘన విజయంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ బోదాస్ శ్రీనివాస్, పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్య గ్రామస్థులు విద్యార్థిని సాన్వి కి వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు గ్రామ పెద్దలు వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. సాన్వీ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు