Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

వర్షా బావ పరిస్థితుల్లో ఆ పంటలు సాగు చేస్తే.. అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం..!

ఈ సంవత్సరం ఎల్-నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి పొదుపు పద్ధతులను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య తెలిపారు.

వర్షా బావ పరిస్థితుల్లో ఆ పంటలు సాగు చేస్తే.. అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం..!

సూర్యాపేట, మనసాక్షి :

ఈ సంవత్సరం ఎల్-నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి పొదుపు పద్ధతులను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య తెలిపారు. వర్షాభావ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్దతులు, మల్చింగ్, నేల తేమ సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమతుల్య ఎరువుల వినియోగం వంటి ఆధునిక సాగు సాంకేతికతలను పాటించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించి అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు.

ఆయిల్ పామ్ సాగు ను చేపట్టవచ్చు. ప్రారంభ 3-4 సంవత్సరాలలో అంతర పంటలుగా కూరగాయలు, పప్పుధాన్యాలు మరియు ఇతర అనుకూల పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
జామ, సీతాఫలం, రేగు, సపోటా, నేరేడు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పండ్ల పంటల సాగును చేయవచ్చును. టమాట, వంకాయ, బెండ, చిక్కుడు, బీరకాయ, సొరకాయ, మునగ తదితర కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

డ్రిప్ నీటిపారుదల మరియు ప్లాస్టిక్ మల్చింగ్ ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా 30-50% వరకు నీటిని ఆదా చేయడంతో పాటు కలుపు నివారణ, అధిక దిగుబడి మరియు మెరుగైన నాణ్యత గల ఉత్పత్తి పొందవచ్చు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ప్రభుత్వం అందించే రాయుతిలు సద్వినియోగం చేసుకొని డ్రిప్ ముల్చింగ్ వంటి అందునతన పద్ధతులు అవాలంభించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య కోరారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు